📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Hydraa : నాగార్జున రియల్ హీరోలా ముందుకు వచ్చారు – సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By Sudheer
Updated: June 29, 2025 • 9:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గతేడాది హైదరాబాద్ మాదాపూర్‌లో సినీనటుడు అక్కినేని నాగార్జున(Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌(N Convention Demolished)ను హైడ్రా అధికారులు కూల్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం చెరువు భూమిపై అక్రమంగా సాగిందని, జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండానే నిర్మించారని అధికారులు స్పష్టం చేశారు. అయితే తాజాగా శిల్పా లే అవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. “కన్వెన్షన్ కూల్చిన తర్వాత నాగార్జున స్వయంగా వచ్చి, నగర అభివృద్ధిలో తన భాగస్వామ్యంగా చెరువు అభివృద్ధికి రెండు ఎకరాల భూమిని ఇచ్చారు. తాను కూడా నిజమైన హీరోలా వ్యవహరించాలని చెప్పారు” అంటూ సీఎం వెల్లడించారు.

హైటెక్ సిటీ అభివృద్ధిపై రేవంత్ వ్యాఖ్యలు

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఐటీ కారిడార్ అభివృద్ధిని గుర్తు చేస్తూ, గత పాలకుల కృషిని కొనియాడారు. “ఒకనాడు హైటెక్ సిటీ, సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి గురించి మాట్లాడితే కొందరు నవ్వారు. కానీ చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకుల దూరదృష్టితో ఇవన్నీ కార్యరూపం దాల్చాయి. ఈరోజు మీరు చూస్తున్న అభివృద్ధి ఆ శ్రమ ఫలితమే” అని అన్నారు.

నగర అభివృద్ధి అందరికీ బాధ్యత: సీఎం రేవంత్

హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం రాష్ట్రానికి అత్యధిక పన్నుల వనరుగా మారిందని సీఎం పేర్కొన్నారు. “ఒకనాడు ఆరు గంటల తర్వాత జనాలు ఊరికి వెళ్ళేలా ఉండే గచ్చిబౌలి ప్రాంతం, ఈరోజు 24 గంటలు పనిచేసే నగరంగా మారింది. ఉద్యోగాలు, ఉపాధి, ఆధునిక జీవనశైలి ఇక్కడ కలిసొచ్చాయి. అందుకే ఈ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం కుదరదు. ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలి. నాగార్జున ఇచ్చిన సహకారం అందుకు ఒక మంచి ఉదాహరణ” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read Also : Acid On Abdomen : ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం ..గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు

cm revanth Google News in Telugu hydraa N Convention Demolished nagarjuna real hero

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.