📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Nagar Kurnool: కార్పొరేట్ కు ధీటుగా సర్కారు దవాఖానాలు

Author Icon By Sharanya
Updated: July 12, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్ కర్నూల్: వైద్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా ఉండేలా వసతులను కల్పించి, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచే స్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) అన్నారు. తెలంగాణ ప్రజల అవసరాలు, వైద్య సేవల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వైద్య విద్యను అందించేలా చర్యలు తీసుకుం టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కల్వకుర్తి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి మంత్రులు పర్యాటక సంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు, రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ దామోదర రాజనర్సింహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్స వాలు చేశారు.

100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన

వెల్దండనుండి సిర్సనగండ్ల వరకు రూ.40కోట్లతో నిర్మించే బిటి (డబుల్) రోడ్డునకు శంకుస్థాపన, కొట్రగేట్ నుండి తలకొండపల్లి వరకు సుమారు 22 కిలోమీటర్ల వరకు రూ.65 కోట్ల వ్యయంతో నిర్మించే బిటి (డబుల్) రోడ్డుకు, కల్వకుర్తిపట్టణంలో రూ.45.50 కోట్లతో నిర్మించే 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన, నాగర్ కర్నూర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీ భవనాల ప్రారంభోత్సవం, నూతన ప్రభుత్వ హాస్పిటల్ (New Government Hospital) నిర్మాణానికి, నూతనంగా నిర్మించే ప్రైమరీ హెల్త్ సెంటర్కు శంకుస్థాపన మంత్రులు చేశారు. నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో 26 ఎకరాల్లో రూ.180 కోట్లతో ఖర్చుతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు, 235 కోట్ల రూపాయలతో 550 పడకల సామర్థ్యంతో అధునాతన వసతులతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఆసుపత్రులు మెడికల్ కళాశాలకు అవసరమైన అన్ని మోళిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు.

మెడికల్ కాలేజీలో నిమ్స్, ఉస్మానియా స్థాయి వసతులు ఉండాలి, కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రులను తీర్చిదిద్దే ప్రయత్నం, ప్రతి 35 కిలోమీటర్లకు ట్రామా కేంద్రం, జిల్లాకు ఓ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. తెలంగాణ 4 ప్రధాన నగరాల్లో క్యాన్సర్ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు అవసరమైన సదుపాయాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను, ఎక్యుమెంట్స్ ఏర్పాటు చేయలేదని, రానున్న సంవత్సరం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని వైద్య కళాశాలల్లో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. వైద్యులకు, వైద్య రంగానికి ఏ సమస్య ఉన్నా నేను సహకరిస్తా, క్వార్టర్లు, హాస్టళ్లు, డిజిటల్ తరగతులు కల్పించేందుకు చర్యలు, ఉపకార వేతనాలు మంజూరు చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అత్యంత ప్రామాణికమైన, అత్యున్నతమైనదని అందుకు అనుగుణంగా వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

వైద్యులను దేవుడిగా భావించే నమ్మకాన్ని నిలబెట్టాలి: మంత్రి జూపల్లి

వైద్యులను ప్రజలు దేవుడితో పోలుస్తారని, ఆ విధమైన నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రానిక్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. జూనియర్ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువకూడదని, గ్రామీణ స్థాయి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృత నిశ్చయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే యువకుడు అని ప్రజల అవసరాలకు పరితపించే వ్యక్తి అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను తన చారిటీ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 235 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని నిర్మించడం నాగర్ కర్నూల్ ప్రజలు అదృష్టవంతులని మంత్రి చెప్పారు. వనపర్తి-జడ్చర్ల రోడ్డు, మహబూబ్గర్ మన్ననూరు రోడ్డును విస్తీర్ణపర్చేందుకు 140 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

వైద్యులను దేవుడిగా భావించే నమ్మకాన్ని నిలబెట్టాలి: మంత్రి జూపల్లి

వైద్యులను ప్రజలు దేవుడితో పోలుస్తారని, ఆ విధమైన నమ్మకాన్ని ప్రజలకు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ విద్యార్థుల రవాణా సదుపాయానికి ఎలక్ట్రానిక్ బస్సును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. జూనియర్ వైద్యులు తమ సొంత గ్రామాలను మరువకూడదని, గ్రామీణ స్థాయి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కృత నిశ్చయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే యువకుడు అని ప్రజల అవసరాలకు పరితపించే వ్యక్తి అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను తన చారిటీ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 235 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని నిర్మించడం నాగర్ కర్నూల్ ప్రజలు అదృష్టవంతులని మంత్రి చెప్పారు. వనపర్తి-జడ్చర్ల రోడ్డు, మహబూబ్గర్ మన్ననూరు రోడ్డును విస్తీర్ణపర్చేందుకు 140 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Breaking News Damodara Rajanarsimha GovernmentHospitals latest news Nagarkurnool PublicHealthcare Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.