Telugu News: Nagar Kurnool: 111 ఆదివాసీ జంటలకు ఒకే వేదికపై పెళ్లిళ్లు

Read Time:  1 min
Nagar Kurnool
Nagar Kurnool
FONT SIZE
GET APP

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్(Nagar Kurnool) జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చెంచు గిరిజన యువతీ యువకులకు అద్భుతంగా సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవులను నమ్ముకొని జనజీవనానికి దూరంగా జీవిస్తున్న ఆదివాసీలను ఒక్కచోటుకు చేర్చి, సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూ 111 మందికి సామూహిక వివాహాలు జరిపించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.

Read Also: ISRO: ఇస్రో మరో బాహుబలి రాకెట్ ప్రయోగానికి సిద్ధం

Nagar Kurnool

గవర్నర్ సహా ప్రముఖుల ఆశీస్సులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, హైకోర్టు జడ్జ్ టి. మాధవి దేవి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆదివాసి కల్యాణ ఆశ్రమం అఖిల భారత కార్యకారిణి రేఖ నాగర్, ప్రాంత అధ్యక్షులు కాట్రాజు వెంకటయ్య, శ్రీశ్రీశ్రీ అంబత్రాయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పర శ్రీ స్వామిలు హాజరయ్యారు. సామూహిక వివాహాలు చేసుకున్న దంపతులను వీరంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) మాట్లాడుతూ, అడవి బిడ్డల వివాహానికి హాజరుకావడం ఆనందంగా ఉందని, ఈ ప్రాంత చెంచు గిరిజనులను మరొకసారి కలుసుకుంటానని అన్నారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఆదివాసీల వివాహాలు జరిపించడం అభినందనీయమని బండారు దత్తాత్రేయ నిర్వాహకులను అభినందించారు.

వివాహ ధృవీకరణ పత్రాల ప్రదానం

హైకోర్టు జడ్జ్ టి. మాధవి దేవి మాట్లాడుతూ సామూహిక వివాహాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం సామూహిక వివాహాలు(marriages) చేసుకున్న నూతన వధూవరులకు వివాహ ధృవీకరణ పత్రాలను గవర్నర్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో వనవాసి కల్యాణ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు ఉడతనూరి లింగయ్య, తెలంగాణ ఆదివాసి మహిళా ప్రముఖ గుర్రం శంఖులత, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్‌లో సామూహిక వివాహాలను ఎవరు నిర్వహించారు?

వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎంతమంది చెంచు గిరిజన జంటలకు వివాహాలు జరిపించారు?

మొత్తం 111 చెంచు గిరిజన జంటలకు వివాహాలు జరిపించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.