📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

N. Ramchandra Rao: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: రాంచందర్ రావు

Author Icon By Sharanya
Updated: July 24, 2025 • 3:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు (N. Ramchandra Rao) అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. యూపిఏ హయాంలో యూరియా కోసం రైతులు బారులు తీరిన క్యూలైన్లలో గొడవలు జరిగి, లాఠీచార్జీలు జరిగిన అనేక ఘటనలు చూశామని అన్నారు.

కొరత లేకుండా రాష్ట్రాల అవసరాలకు యూరియా

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా, ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ (Distribution of urea) జరుగుతుందన్నారు. అయినా ఇటీవల బిజెపిని బద్నాం చేయడానికి కొన్ని శక్తులు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని అన్నారు. రబీ సీజన్ కోసం తెలంగాణకు అవసరమైన యూరియా 9.5 లక్షల మెట్రిక్ టన్నులు అని, కేంద్రం సరఫరా చేసిన యూరియా 12.02 లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు. ఇది అవసరానికి మించి 2.5 లక్షల టన్నుల అదనపు సరఫరా అన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఫర్టిలైజర్ షాపుల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు. కేంద్రం పంపిన ఎరువులను రాష్ట్రంలోని కొంతమంది బ్లాక్ మార్కెట్కి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అన్నారు. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్, ఎరువుల డీలర్లపై సరైన మానిటరింగ్ లేకపోవడం, సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నిరక్ష ్యం అని రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యానికి నిదర్శనం అన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేర అవసరమో అంత మేర యూరియా ఇవ్వడానికి కేంద్రం సిద్ధం గా ఉందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతో రైతుల్లో అపోహలు సృష్టిస్తుం దన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వంటి ప్రాంతం కాటన్ సీడ్ బౌల్గా పేరుగాం చిందని, అలాంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫర్టిలైజర్ షాపులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నారని అన్నారు.

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిజెపి డిమాండ్

పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్ స్థాయి నుంచి జెడ్పిటిసి స్థాయివరకు సిద్ధంగా ఉండాలన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిజెపి డిమాండ్ చేస్తుందన్నారు. అయినా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బిజెపిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బిజెపిపై తప్పుడు ప్రచారం చేయడమే కాంగ్రెస్ నాయకుల ప్రధాన లక్ష ్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో బిజెపికి మంచి వాతావరణం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కలిసిమెలిసి పని చేసి బిజెపిని గెలిపించాలి. బిజెపి మనకు తల్లిలాంటి పార్టీ అన్నారు. అలాంటి పార్టీకి ఎవరూ కూడా ద్రోహం చేయరాదన్నారు. మహబూబ్ నగర్ ఎంపి స్థానంతో పాటు మున్సిపాలిటీలు, నారాయణ పేట మున్సి పాలిటీ, మక్తల్ చైర్మన్ స్థాయిలలో బిజెపి విజయాలు
సాధించిందన్నారు. రానున్న రోజుల్లో బిజెపి రాష్ట్రంలో మరింత బలమైన వాతావరణం ఉందని, అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్దపు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతుం దన్నారు. గతంలో నేను ఎమ్మెల్సీ గా రాష్ట్రవ్యాప్తంగా సేవలందించాను. ఆ సమయంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజలు నాపై విశేష ఆదరణ చూపారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Ponguleti Srinivasa Reddy: ఐదు గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్లు : మంత్రి పొంగులేటి

BJP Telangana Breaking News latest news mahabubnagar N. Ramchandra Rao Party strengthening BJP Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.