నా వెనుక ఉన్నది మోడీ మాత్రమే
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు
హైదరాబాద్ : తన వెనుక ఎవరూ లేరని, ఉన్నది ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) మాత్రమేనని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఇండియా కూటమిలో ఐక్యత లేదని స్పష్టమైందన్నారు.
తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్లకు జీతాలు రావడం లేదు. యూనివర్సిటీ హాస్టళ్లు ఆధ్వానంగా తయారయ్యాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో యూనివర్సిటీలను నడుపుతూ భావితరాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) కి వెళ్లి రూ. వెయ్యికోట్లు ఇస్తానని సిఎం రేవంత్ గొప్పలు చెప్పారు.
పార్టీలో అసమానతలు లేవని అన్నారు
దావోస్కు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? అంటూ రాజాసింగ్ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కొందరి కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాని, కార్యకర్తలకు. పార్టీ అన్యాయం చేయదని, 60శాతం కొత్తవారికి, 40శాతం పాతవారికి అవకాశం ఇవ్వాలని పార్టీలో నిబంధన ఉందని తెలిపారు. ప్రకారమే కమిటీ ఏర్పడిందని, అందరికీ అవకాశాలు వస్తాయని అన్నారు. పార్టీలో ఇంకా 600 పోస్టులు ఉన్నాయని తెలిపారు.
కార్యకర్తలందరికీ న్యాయం చేస్తామని. పార్టీలో అసమానతలు లేవని అన్నారు. పనిచేసే వాళ్ళను కమిటీలో తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా (Urea) తో బ్లాక్ మార్కెట్ చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడటా నికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. హైడ్రా కూల్చివేతలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తలాబ్ కట్టాకి వెళ్ళి హైడ్రా సర్వే చేసిందా? అక్కడికి వెళ్లగలరా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోతుందన్నారు
ఇండియా ఆలయెన్స్ ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు. మోడీ, ఐక్యత కొరవడిందని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అమిత్ షా (Amit Shah) లతో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఖర్గే మాట్లాడుతున్నారని. ఎమర్జెన్సీ కన్నా ప్రమాదం ఏముంటుంది ఖర్గే చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖను కాంట్రాక్టు వ్యవస్థతో నడిపించడం దురదృష్టకరమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల తర్వాత అన్ని రంగాల్లో విఫలమైంది.
ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 హామీలు, 100 రోజుల్లో నెరవేర్చే వాగ్దానాలు 22 నెలల్లో నెరవేరలేదన్నారు. తెలంగాణ ఆర్ధిక, పరిపాలనా పరిస్థితి ఆధ్వాన్నంగా ఉందన్నారు. రోజురోజుకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిపోతుందన్నారు. సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, మలేషియా, సింగపూర్ పర్యటనలకు వెళ్లి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామన్నారు.
నిధులు, నియామకాలు సక్రమంగా నిర్వహించలేదు
మరి ఆ పెట్టుబడులు ఏమైనట్లు? స్పష్టత లేదు. వాస్తవానికి కాంగ్రెస్ నాయకులు విదేశీ పర్యటనల ప్రయాణ, ఫ్లైట్ ఖర్చులు వృథా చేశారు తప్పితే.. తెలంగాణ (Telangana) కు ఒరగబెట్టింది గుడ్డిసున్నా అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్ట్ను కూడా సక్రమంగా,జిహెచ్ఎంసీ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో 10వ స్థానంలో ఉంది. రోడ్ సేఫ్టీ తెలంగాణ 8వ స్థానంలో, మరణాల్లో ప్రారంభించలేదు.
పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది. అడ్మినిస్ట్రేషన్ పెరాలసిస్ తెలంగాణలో కొనసాగుతోంది. నీళ్లు, నిధులు, నియామకాలు సక్రమంగా నిర్వహించలేదు. దేశ డిపార్ట్మెంట్ కూడా సమర్థవంతంగా పనిచేయడం లేదు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధిచెబుతారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రం మెదలు వంచుతామని విమర్శలు చేస్తున్నారు.
పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు
అసలు కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను, మోసాన్ని ప్రజల గ్రహించారు. వాస్తవ పరిస్థితులను గుర్తు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధిచెబుతారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి టిజిపిఎస్సి నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు, నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని హైకోర్టు తేల్చిందన్నారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ (Public Service Commission System) లో లోపాలు బయటకు వచ్చాయి. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకాశితం చేసి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు ఒక్క పరీక్షను కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు.
కేవలం మూడు బ్యారేజీలపైన మాత్రమే విచారణ
ఇది వారి అసమర్థతను చూపుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) లో జరిగిన ఆవినీతి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోష్ కమిటీని ఏర్పాటు చేసినా, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవినీతి అంశాలను మాత్రమే సిబిఐ విచారణకు అప్పగించారు.
క్వాలిటీ, అవినీతి, మెయింటెనెన్స్ విషయంలో కేవలం కొన్ని బ్యారేజీల పరిమితమైన పరిశీలన కాకుండా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతిపై సిబిఐ పూర్తి విచారణ జరగాలి. కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు బ్యారేజీలపైన మాత్రమే విచారణకు ఆమోదించింది. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన అన్ని అంశాలపై సిబిఐ విచారణకు కోరాలి.
అధ్యక్షుడు కప్పర ప్రసాద్ తో పాటు
తెలంగాణలో కృత్రిమంగా యూరియా కొరత సృష్టిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ వైఫల్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెబుతున్నారు. నిజానికి తెలంగాణకు కేంద్రం కావాల్సినంత యూరియాను అందించింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను దాస్తూ, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బ్లాక్ మార్కెటింగ్ కారణంగా రైతులకు సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు.ద ప్రెస్ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: