📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News telugu: N Ramchander Rao: రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి :బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

Author Icon By Sharanya
Updated: September 16, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్లు కాలేజీలు బంద్కు బిజెపి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాలేజీలకు భారీగా బకాయిలు పెరగడంతో, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురయ్యాయి.

News telugu

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు (Private colleges) తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితికి వచ్చాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ చర్య వల్ల ఏర్పడిన పరిస్థితి అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, రూ.8 వేల కోట్లు పైగా ఉన్నప్పటికీ, రెండేళ్లుగా ఒక్క పైసా ఒక్క పైసా కూడా విడుదల చేయడం లేదని, ఫీజు రీయింబర్మెంట్ లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు ప్రొఫెసర్లు, లెక్చరర్స్, టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం గత ఆరు నెలలుగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడుతూ మేమ త్వరలో పరిష్కారం చేస్తాం” అని చెప్పినా, ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టమైన నిర్ణయం గానీ పెండింగ్
బకాయిలు విడుదల చేయలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు (Education Assurance Cards)ఇస్తామని నాగ్దానం చేసింది. కానీ ఈ నాగ్దానం ఇప్పటి వరకు అమలుకావడం లేదన్నారు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీదే ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మరింత కూలిపోయే పరిస్థితికి లోనవుతుందని అన్నాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1000 కోట్లు నిధులు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి రిటైర్డ్ టీచర్లకు పెన్షన్లు కూడా కవ్వని పరిస్థితి దాపురించింది. భారతీయ జనతా పార్టీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా మద్దతు పలుకుతుండన్నారు. కొత్త యూనివర్సి టీలకు కనీసం భవన నిర్మాణాలు చేయకపోవడం సబబుకాదు. ఇప్పటికైనా అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన బాధ్యత అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త భవనాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు.

ఎన్. రాంచందర్రావు ఎలాంటి డిమాండ్ చేశారు?

ఆయన తెలంగాణ ప్రభుత్వం వెంటనే రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, అందువల్ల ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలు నిమిత్తం నిరంతర సేవలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల లేకపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి?

బకాయిల కారణంగా ఆసుపత్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి, సేవలు నిలిచిపోవచ్చు, పేషెంట్స్‌కు వైద్య సౌకర్యాలు అందకపోవచ్చు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/godavari-river-basin-study-divided-into-three-parts/telangana/548266/

bjp demand BJP Telangana Breaking News Government Payments latest news N Ramchander Rao reimbursement dues Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.