📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

N. Ramachandra Rao: మేధావులు, విద్యావంతులు బిజెపిలో చేరాలి

Author Icon By Saritha
Updated: January 19, 2026 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్టీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పిలుపు

హైదరాబాద్ : బిజెపి(BJP) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు (N. Ramachandra Rao) సమక్షంలో ప్రముఖ డాక్టర్ సాయిచంద్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చదువుకున్నవారు, మేధావులు, విద్యావంతులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గతంలో రాజకీ యాలంటే కేవలం డబ్బున్నవారో, అంగబలం లేదా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారో మాత్రమే వస్తారని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందన్నారు. దేశాన్ని కాపాడగల నాయకుడు ఎవరు? దేశ సమస్యలను పరిష్కరించగల పార్టీ ఏది? దేశద్రోహ శక్తులు ఎందుకు పెరుగు తున్నాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఈ ప్రశ్నలపై యువతలో స్పష్టమైన ఆలోచన పెరిగిందని ఆయన అన్నారు. దేశవిరోధి శక్తులను ఎదుర్కోవాలంటే దేశాన్ని ప్రేమించే, సమాజం పట్ల బాధ్యత కలిగిన చదువుకున్నవారు కూడా ఒక సంఘటిత శక్తిగా మారాల్సిన అవసరం ఉంది. అందుకే నేడు మేధావులు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం ఒక సానుకూలమైన, ఆశా జనకమైన పరిణామంగా దేశం చూస్తోందన్నారు.

Read Also: Telangana: యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం

మేధావులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్న ఎన్. రాంచందర్రావు

ఇటీవలి కాలంలో యువ నాయకులు, విద్యా వంతులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతూ సేవలో భాగస్వాములు అవుతున్నారని (N. Ramachandra Rao) పేర్కొన్నారు. బీహార్లో అతి తక్కువ వయసులో ఎమ్మె ల్యేగా గెలిచిన యువ నాయకులు కూడా బీజేపీలో చేరడం.. రాజకీయాల్లోకి వస్తున్న నూతన తరానికి స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు ప్రజలకు విధానాలు చూపించలేక, బూతుల రాజకీయాలతోనే కాలం గడుపుతున్నాయి. ఒకరు ప్యాంట్ విప్పుతా అంటారు, మరొకరు తోలు తీస్తా అంటారు. ఈ రకమైన భాష, ఈ రకమైన రాజకీయాలు రాబోయే తరానికి తీవ్రంగా ప్రమాదకరమైనవన్నారు. రాజకీయాలు అంటే వ్యక్తిగత దూషణలు కాదు, కొట్టుకోవడాలు కాదు. రాజకీయాలకు ఒక గౌరవం ఉండాలి. ఒక విలువ ఉండాలి. ప్రజల సమస్యలపై మాట్లాడే పరిపక్వత ఉండాలి. ఆ మార్పు రావాలంటే మేధావులు, చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాల్సిందే అని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు బీజేపీ లక్ష్యం

(N. Ramachandra Rao) రాజకీయాల్లోకి రావడం అంటే అందరికీ టికెట్లు ఇవ్వడమే కాదు. దేశం పట్ల, సమాజం పట్ల బాధ్యత, సామాజిక స్పృహ. రాజకీయ అవగాహన ఉంటే అటువంటి వారి భాగస్వామ్యం నిర్మాణానికి తప్పకుండా. ఉపయోగపడుతుందన్నారు. దేశాన్ని కాషాయం వైపు సాగుతోంది. ఈ మార్పునకు శక్తివంతంగా చేయాలంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, భారత్ను ఒక జాతీయ శక్తిగా నిలబెట్టాలంటే మేధావులు భారతీయ జనతా పార్టీకి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుంది. దేశం మొత్తం క్రమంగా నాంది పలకా ల్సింది మేధావులే తెలంగాణ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిదే అని చెప్పారు. చేరిక కార్య క్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బిజెపి రంగా రెడ్డి(పట్టణ) జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్(పట్టణ) జిల్లా కన్వీనర్ డాక్టర్ మల్లారెడ్డి, మాధవరం కాంతారావు, డా. రాజశేఖర్ రెడ్డి,, మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజ్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:



BJP BJPTelangana IntellectualsInPolitics Latest News in Telugu NRamchanderRao PoliticalJoining TelanganaPolitics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.