(Municipal elections) ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాలపై కఠిన నిఘా పెట్టినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: Mulugu: సైబర్ వేధింపుల భారం తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ (Election Commission) ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాల బంద్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఇవాళ (సోమవారం) సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించనున్నారు. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: