Municipal Elections Results: ‘పార్టీలైన్’ దాటితే ఎలా?

Read Time:  1 min
Municipal Elections Results: 'పార్టీలైన్' దాటితే ఎలా?
Municipal Elections Results: 'పార్టీలైన్' దాటితే ఎలా?
FONT SIZE
GET APP

అనైతిక పొత్తులపై నివేదిక కోరిన బిజెపి అధిష్ఠానం

Municipal Elections Results: తెలంగాణలో బీజేపీలో మున్సిపల్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. హంగ్ వచ్చిన చోట పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ లైన్ ను అతిక్రమించడంపై బీజేపీ (BJP) అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ వుంజుకుంటున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లతో బీజేపీ నేతలు కుమ్మక్కు అయ్యారన్న అంశం అధిష్టానాన్ని ఆగ్రహానికి గురిచే స్తోంది. అదేసమయంలో హంగ వచ్చిన మున్సిపాలి టీల్లో కమలం పార్టీ వైఖరిపై రాష్ట్ర రాజకీయాలతో పాటు బీజేపీ నేతల్లో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కాషాయ దళం ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కోలా వ్యవహరించడంతో అసలు కమలనాథులు ఎటున్నారన్న అంశం రాజకీయ గందరగోళానికి దారి తీసింది.

Read Also: AI Summit 2026: ‘ఏఐ సమ్మిట్’కు సీఎం రేవంత్

Municipal Elections Results: 'పార్టీలైన్' దాటితే ఎలా?
Municipal Elections Results: What if you cross the ‘party line’?

గందరగోళంలో బీజేపీ శ్రేణులు

బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందు నుంచీ అనైతిక పొత్తులు పెట్టుకోబోం, ఎవరితో కలవబో మని ప్రకటించింది. ఆ మేరకు కొన్ని మున్సిపాలిటీ ల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా మేయర్, చైర్మన్ అవకాశాన్ని వదిలేసుకుంది. అయితే మరికొన్ని చోట్ల మాత్రం సిద్ధాం తాలు, పార్టీ క్రమశిక్షణా నియామవళి, పార్టీలైన్ వీటన్నింటినీ పక్కన పెట్టేసి అధికారంకోసం ప్రత్యర్థులతో జతకట్టిన బీజేపీ రాజీకీయ విశ్లేషకులు, ప్రజలు చివరకు బీజేపీ శ్రేణులను ముక్కున వేలేసుకునేలా చేసింది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మున్సిపాలి టీల్లో ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకు న్నారు. ముందే అంచనాలు వేసుకుని పార్టీకి అవస రం అనుకున్న చోట నమోదు చేసుకున్నారు.

కీలక నేతల వ్యవహారశైలిపై అసంతృప్తి

అయితే.. బీజేపీలో సీనియర్ నేతలు, ఎంపీలుగా ఉన్న రఘునందన్ రావు, ఈటలరాజేందర్ అందుకు భిన్నం గా వ్యవహరించారు. అసలు ఎవరూ ఊహించని చోట ఆ ఎంపీలు ఎక్స్ అఫిషియో ఓటర్స్ గా నమోదు చేసుకున్నారు. దీంతో ఎంపీలు ఈటల రాజేందం, రఘునందన్రావు వ్యవహారశైలిపై ప్రధాని మోడీతో సహా బీజేపీ కేంద్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల అనంతరం జరిగి చైర్మన్ ఎంపిక సందర్భంగా ఇస్నాపూర్ లో బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఏకంగా బీఆర్ఎస్ కు ఓటు వేయడం పార్టీ వర్గాల్లో చర్చనీయాం శమైంది. అటు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపేటలో కూడా బీజేపీ, బీఆర్ ఎస్కు మద్దతు పలికింది. అయితే ఈటల అక్కడ ఎక్స్ ఆఫీ షియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నప్పటికీ ఓటు వేయకపోవడంపై అధిష్టానం గుర్రుగా ఉంది.

ఢిల్లీ పెద్దలు సీరియస్

పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా, బద్ధ శత్రువులైన కాంగ్రెస్, బీఆర్ఎస్లతో ఈ రహస్య పొత్తులేంటని ఢిల్లీ పెద్దలు మండిపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ వెంటనే రంగంలోకి దిగారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకు ఫోన్ చేసి పూర్తి వివరాలు కోరినట్టు సమాచారం. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా రాంచందర్రావును కలిసి ఈ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.

జిల్లాల వారీగా జాబితా సిద్ధం చేసిన బిజెపి రాష్ట్ర నాయకత్వం

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్ దాటి ఎవరెవరు ఎక్కడెక్కడ పొత్తులు పెట్టుకున్నారో, ప్రత్యర్థులకు ఎలా సహకరించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లుగా సమాచారం. అధిష్టానం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ లైన్కు వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అపవిత్ర పొత్తులపై లిస్ట్ సిద్ధం బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఇప్పటికే జిల్లాల వారీగా జాబితా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన లీడర్లపై కేంద్ర బీజేపీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సొంత పార్టీ అభ్యర్థులను కాదని, ప్రత్యర్థులతో చేతులు కలిపిన కీలక నేతలకు ఈసారి అధిష్టానం గట్టి వార్నింగ్ ఇవ్వున్నట్లుగా తెలుస్తోంది.

కరీంనగర్ లో కమల వికాసం

ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల ఫలితాల్లో బీజేపీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అతిపెద్ద విజయం ఇదే. కరీంనగర్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడమే కాకుండా, తన బలాన్ని నిరూపించుకుంటూ మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడ బీజేపీ మొత్తం 66 డివిజన్లలో 30 స్థానాలను గెలుచుకుంది. స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలలో బీజేపీ ఒక చైర్మన్ పదవిని, ఏడు వైస్చోర్మెన్ పదవులను దక్కించుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 21 వార్డులను గెలుచుకుని బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.