తెలంగాణలో(TG) మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియలో (Municipal Elections) కీలక ముందడుగు పడింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
Read also: Telangana: ఇంటి వద్దకే మేడారం బంగారం
ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది. (Municipal Elections) ఒకటి, రెండు రోజుల్లోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 10 కార్పొరేషన్లలో ఎస్సీ-1, ఎస్టీ-1, బీసీ-3 కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఐదు స్థానాలకు గానూ ఏకంగా నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో ఎస్సీ-17, ఎస్టీ-5, బీసీ-38, జనరల్-61 కేటాయించడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో కల్లూరు, భూత్పూర్, మహబూబాబాద్, కేసముద్రం, ఎల్లంపేట్ ఉన్నాయి. ఎస్సీ జనరల్ కేటగిరీలో స్టేషన్ ఘన్‌పూర్, జమ్మికుంట, డోర్నకల్, లక్షెట్టిపేట, మూడుచింతలపల్లి, నందికొండ, మొయినాబాద్, కోహిర్, హుస్నాబాద్ ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: