Municipal elections: కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

Read Time:  1 min
Municipal elections: కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం
FONT SIZE
GET APP

తెలంగాణ (TG) మున్సిపల్ ఎన్నికల(Municipal elections) ప్రచారం జోరుగా సాగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 20 వార్డులలో మూడు చోట్ల పోటీ రసవత్తరంగా ఉంది. అభ్యర్థులు గెలుపు కోసం ఎలాంటి ఖర్చుకి వెనక్కి తగ్గకుండా వ్యూహాలు రూపొందిస్తున్నారు, ఇక ఎన్నికల వేళ మద్యం, డబ్బు ఏరులై పారుతోంది. కొన్నిచోట్ల అయితే రాజకీయం అసలు రంగు బయటపడుతోంది.

ఓ వార్డులో కండువా కప్పుకొని యువకులు ప్రచారం చేస్తే ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పును స్పాట్ పేమెంట్ ఇస్తున్నాడు ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి. ప్రత్యర్థి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. అంతే పెద్ద మొత్తంలో నగదు ఇస్తానని ఆశచూపుతున్నాడు. దీంతో ఉదయం ఒక పార్టీలో ఉంటే.. సాయంత్రానికి మరోక పార్టీలో చేరిపోతున్నారు సదరు యువకులు. అటుఇటు పార్టీలు మారుతున్నారు. మరో రెండు వార్డుల్లోనూ పార్టీ కండువాలను కప్పుకొంటే రూ.10వేల వరకు ఇస్తున్నారు. భలే మంచి బేరం దొరికిందంటూ యువకులు సొమ్ము చేసుకుంటున్నారు.

Read Also: Kukatpally police arrest : రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

Municipal elections: కండువా కప్పుకుంటే రూ. 20 వేలు.. భలే మంచి బేరం

ఎన్నికల్లో డబ్బు రాజకీయాలు, అధికార స్థానాల పోటీ

ఎన్నికలంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. దీంతో బాగా డబ్బున్న వారు ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో సమాజం పట్ల అవగాహన, సేవాభావం కలిగిన వారు డబ్బులేనిదే రాజకీయం చేయలేమని పోటీకి వెనకడుగు వేస్తున్నారు. ఈ డబ్బు రాజకీయాలు మన వల్ల కాదని ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 11న ఎన్నికలు (Municipal elections) జరగనుండగా ఫిబ్రవరి 13న కౌంటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్‌పర్సన్లు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 2,996 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.