📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Municipal Corporation : రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలకు గ్రీన్ సిగ్నల్

Author Icon By Shravan
Updated: August 1, 2025 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
ఇకపై అన్ని కార్పొరేషన్లలో లభ్యం త్వరలో నోటిఫికేషన్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మైక్రోబ్రూవరీల (Microbreweries) విస్తరణకు గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది.
ఇప్పటివరకు హైదరాబాద్ కు పరిమితమైన ఈ బ్రూవరీలు ఇకపై అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించనున్నాయి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లోనూ మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అనుమతులు లభించనున్నాయి. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. దీనివల్ల క్రాఫ్ట్ బీర్ ప్రియులకు కొత్త రుచులు అందుబాటులోకి రావడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా. తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం మైక్రోబ్రూవరీల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్కే పరిమి తమైన ఈ బ్రూవరీలు ఇకపై రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లకు విస్తరించ నున్నాయి.

ఈ మేరకు నిబంధనల సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యంగా 2017 నుంచే ఇతర కార్పొరేషన్ల పరిధిలో మైక్రో వరంగల్ (Warangal) నుంచి దరఖా స్తులు వస్తుండ టంతో.. బ్రూవరీలను అనుమతిం చాలని నిర్ణయించారు. ఆగస్టులో దీనికి సంబం ధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు న్నాయి. సాధారణంగా పెద్ద వాణిజ్య బ్రూవరీల మాదిరిగా కాకుండా, మైక్రోబ్రూవరీలలో చిన్న స్థాయిలో బీరు ఉత్పత్తి అవుతుంది. ఇవి తరచుగా కొత్త, ప్రత్యేకమైన రుచులతో క్రాఫ్ట్ బీర్లను తయారు చేస్తాయి. ఈ బీర్ను అదే ప్రాంగణంలో లేదా స్థానికంగా విక్రయి స్తారు. ప్రస్తుతం హైద రాబాద్లోని 18 మైక్రో బ్రూవరీలు యువతకు, క్రాప్ట్బర్ ప్రియులకు ప్రధాన వినోద కేంద్రా లుగా మారాయి. పండు గలు, ప్రత్యేక సీజన్ల కోసం సీజనల్ బ్రూస్లను తయారు చేస్తారు. కొన్ని చోట్ల బీరు తయారీ ప్రక్రియను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు.

తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల కంటే ఎక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, మైక్రోబ్రూవరీల విస్తరణ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో అధిక సంఖ్యలో మైక్రోబ్రూవరీలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో హైదరా బాద్ కూడా వాటి సంఖ్యను పెంచడంపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. జీహెచ్ఎంసీ పరిధిని దాటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల వరకు అనుమతి ఇవ్వడం ద్వారా మరిన్ని బ్రూవరీలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. గ్రేటర్ హైదరాబాద్ పాటు, ఇకపై వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం వంటి మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా మైక్రోబ్రూవరీలను ఏర్పాటు చేసేందుకు అనుమ తులు లభిస్తాయి. స్థానిక ఆసక్తిని బట్టి ఒక్కో కార్పొరేషన్లో ఒకటి కంటే ఎక్కువ బ్రూవరీలను ఏర్పాటు చేసుకోవచ్చు. త్వరలోనే ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుని, కొత్త లైసెన్స్ల జారీకి మార్గదర్శకాలను రూపొందించే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ ఆగస్టులోనే దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయంతో మందుబాబులకు కావాల్సిన బీర్లు దొరకటంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా.

READ MORE :

https://vaartha.com/bc-gurukula-student-win/telangana/524134/

Breaking News in Telugu Green signal Latest News in Telugu Microbreweries municipal corporation Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.