📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన ఎంపీ అర్వింద్ !

Author Icon By sumalatha chinthakayala
Updated: March 5, 2025 • 6:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్‌గా కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి.. ఇప్పుడు తిప్పలు పడుతున్నారని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదు

ఇదిలా ఉండగా.. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారు. తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చింది ప్రధాని మోడీ కానీ ఎయిర్ పోర్టును తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురావడం లేదు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి దక్షిణభాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. దీన్ని ఆపింది ఎవరు?, తన కంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపుమంట అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

BJP Breaking News in Telugu CM Revanth Reddy Google news Google News in Telugu Latest News in Telugu MP Arvind Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.