📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Mounika: పంక్చర్‌‌ షాప్ ఓనర్ కూతురు డీఎస్పీ జాబ్ కొట్టింది

Author Icon By Anusha
Updated: September 27, 2025 • 7:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలోని జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనిక (Mounika)అనే యువతి నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, తన కృషితో, పట్టుదలతో గ్రూప్ 1 ఉద్యోగంని సాధించడంలో చరిత్ర రాసింది. ఈ ఘన విజయం “కష్టపడితే ఏదైనా సాధ్యమే” అనే సిద్ధాంతాన్ని మళ్ళీ నిరూపించింది.మౌనిక తల్లి సరోజ కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారు.

Hyderabad Metro : ప్రాజెక్ట్‌పై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి

తండ్రి సమ్మయ్య గ్రామంలో ఒక చిన్న పంక్చర్‌‌ షాపు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తమ కూతురు చదువుకు వారు అడ్డు చెప్పలేదు. వారి శ్రమ, త్యాగాలను చూసిన మౌనిక.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రులకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలని చిన్ననాడే లక్ష్యంగా పెట్టుకుంది.

Mounika

సొంతంగానే ప్రిపరేషన్ మెుదలు పెట్టింది

అందుకు అనుగుణంగానే చదువును కొనసాగించింది.2020లో డిగ్రీ పూర్తి చేసిన మౌనిక.. ఆ తర్వాత ఉద్యోగ సాధనపైనే పూర్తి దృష్టి సారించింది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో, పెద్ద మొత్తంలో ఫీజులు కట్టి కోచింగ్‌ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సొంతంగానే ప్రిపరేషన్ (Preparation)మెుదలు పెట్టింది. ఇంట్లోనే చదువుకుంటూ గ్రూప్‌‌-1 పరీక్షకు సన్నద్ధమైంది. స్వీయ అధ్యయనం, నిరంతర కృషి, పట్టుదలతో చదివి.. తాజాగా విడుదలైన గ్రూప్‌‌-1 (Group 1)ఫలితాల్లో 315వ ర్యాంక్‌‌ సాధించింది.

ఈ ర్యాంకు ద్వారా ఆమె డీఎస్పీ పోస్టుకు ఎంపికైంది.కూలీ పనులు చేస్తూ, పంక్చర్‌‌ షాపు నడుపుతూ కష్టాలు పడిన తల్లిదండ్రుల ముఖంలో ఈరోజు మౌనిక విజయం వెలుగులు నింపింది. కోచింగ్‌ లేకుండానే రాష్ట్ర అత్యున్నత సర్వీసులో సత్తా చాటి డీఎస్పీ (DSP)గా ఎంపికైన మౌనిక పట్టుదలకు, కష్టానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఆమె ఈ విజయం ఎందరో పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మౌనికను పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి కూతురు ఉండాలని కొనియాడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News education success government job achievement group 1 job achiever hard work pays off latest news moumika story poor family background rural talent telangana success story Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.