తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వర్షాల ప్రభావం కొనసాగుతోంది. పలు జిల్లాలు వర్షపు తాకిడికి పూర్తిగా నిండిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో గత కొన్ని గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పంటపొలాలు, చెరువులు, నదులు నీటితో నిండిపోతున్నాయి. కొన్నిచోట్ల చిన్న వాగులు ఉప్పొంగి రహదారులపైకి నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
Group 2: రేపే గ్రూప్ తెలంగాణ 2 ఫైనల్ ఫలితాలు?
ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి.ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో మూసీ నది (Musi River) ఉప్పొంగుతోంది. దీంతో మూసారాంబాగ్ బ్రిడ్జి (Moosarambagh Bridge) పూర్తిగా నీట మునిగింది. మూసారాంబాగ్, గోల్నాక బ్రిడ్జిలను అధికారులు మూసివేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా నీట మునిగింది. అంబర్ పేటతో సహా పలు ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: