Joseph kent resignation : ఇరాన్‌పై యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి రాజీనామా చేశారు.
ఇరాన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తన మనస్సాక్షి ఈ నిర్ణయానికి అంగీకరించడం లేదని పేర్కొంటూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
యుద్ధంపై అభ్యంతరం
ఇరాన్‌తో అమెరికాకు తక్షణ ప్రమాదం లేదని జోసెఫ్ కెంట్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ఈ యుద్ధం ప్రారంభించబడిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధం వల్ల అమెరికాకు ప్రాణనష్టం, ఆర్థిక నష్టం తప్ప మరే లాభం ఉండదని కూడా తెలిపారు.
ట్రంప్ నిర్ణయంపై విమర్శలు
ట్రంప్ తీసుకున్న నిర్ణయం జూన్ 2025 తర్వాత మారిందని, కొంతమంది ఉన్నతాధికారులు, మీడియా ప్రభావంతో ఈ యుద్ధం ప్రోత్సహించబడిందని కెంట్ ఆరోపించారు.
Read Also: Addanki Crime: అనుమానంతో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య

అమెరికాలో నిరసనలు
ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో భారీ నిరసనలు జరుగుతున్నాయి. న్యూయార్క్, వాషింగ్టన్ డి.సి, లాస్ ఏంజిల్స్, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ‘No More Wars’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు నిర్వహించారు.
రాజకీయంగా ఒత్తిడి
అమెరికా పార్లమెంట్‌లో కూడా ఈ యుద్ధంపై తీవ్ర చర్చ జరుగుతోంది. డెమోక్రాట్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తుండగా, ట్రంప్ పార్టీ లోపల కూడా విభేదాలు వ్యక్తమవుతున్నాయి.
పార్లమెంట్ అనుమతి లేకుండా యుద్ధం ప్రారంభించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పెరుగుతున్న వ్యతిరేకత
అమెరికా ప్రజల డబ్బు, సైనికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: