నిందితుడు అరెస్టు.. 15 కిలోలు స్వాధీనం
హైదరాబాద్ (అత్తాపూర్) : అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి అక్రమంగా జింక మాంసం(Deer Meat Sale) విక్రయిస్తున్నాడని పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు సులేమాన్ నగర్ లో దాడులు చేసి జింక మాంసం అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్(Mohammed Irfanuddin) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్
అతనివద్ద నుంచి 15 కిలోల జింక మాంసం, జింక తోలు, తలతో పాటు 3,500 నగదు స్వాధీనం చేసుకొని అత్తాపూర్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అయితే కర్నూల్ జిల్లా (Kurnool District) పెబ్బేరు నుంచి నగరానికి జింకను తీసుకువచ్చి స్థానికంగా వధించి 800 రూపాయలకు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: