చిట్యాల (నల్గొండ) : మొగుళ్ళపల్లి మండలం కోర్కిశాలలోని కస్తూర్బా గాంధీ ఆశ్రమపాఠశాలలో (Kasturba Gandhi Ashram School) ఫుడ్ పాయిజన్ జరిగి 32 మంది విద్యార్థినీలు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 18 మంది విద్యార్థినిలను మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించగా, మిగతా 14 మంది విద్యార్థినిలను చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆసుపత్రికి (Civil Hospital) తరలించి, చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం విద్యార్థినిలకు కిచిడి తోపాటు టమాట పచ్చడి అల్పాహారంగా ఇచ్చారు. అల్పాహారంలో వచ్చిన పురుగుల మూలంగా విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పాఠశాల ఉపాధ్యాయినీలు విద్యార్థినీలను ఆస్పత్రికి తరలించారు.
అల్పాహారంలో పురుగుల కలయికతో విద్యార్థినీల అస్వస్థత
మొగుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిట్యాల మండల కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన విద్యార్థినీలను తరలించి చికిత్స అందిస్తున్నారు. 32 మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురైన విషయాన్ని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఆస్పత్రులకు తరలివచ్చారు. విషయం తెలుసుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Satyanarayana Rao) సివిల్ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థినిలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిచిడీలో పురుగు వచ్చిందని అల్పాహారం తీసుకున్న విద్యార్థినిలు స్వల్పంగా అస్వస్థతకు గురైన విషయాన్ని తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థినీలు అందించిన సమాచారం మేరకు వంట మనుషుల లోపాన్ని గ్రహించడం జరిగిందని చెప్పారు. ఈ సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థినీల పరిస్థితి క్షేమంగా ఉందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
విద్యార్థినీలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు?
అల్పాహారంగా ఇచ్చిన కిచిడీలో పురుగు రావడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి వారు వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు.
అధికారుల స్పందన ఏంటి?
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినీలను పరామర్శించారు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: