📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: MLC Mahesh Kumar: బిసి రిజర్వేషన్ ను అడ్డుకొంటున్న బిజెపి

Author Icon By Saritha
Updated: November 27, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అరాచకశక్తులు రాజ్యాంగాన్ని మార్పు చేయాలని చూస్తున్నాయి

నిజామాబాద్ : బిజెపి ఉద్దేశ్యపూర్వకంగా బిసి రిజర్వేష్ అడ్డుకొంటుందని ఆరోపించారు. బుధవారం నిజమాబాద్ ని(MLC Mahesh Kumar) కంఠేశ్వర్ సమీపంలోని నీలకంఠేశ్వర్ ఆలయంలో టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పరిసరాల్లో ఆయన పర్యటించి ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు, వేధోచరణల మధ్య టిపిసిసి చీఫ్కి ఆలయ అర్చకులు, దేవాధి కారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగత సత్కారం అందించారు. యూత్ కాంగ్రెస్తో కలిసి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసినా కేం ద్రంలోని ఢిల్లీ పాలకులకు కనువిప్పు కలుగలేదని 42శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వారికి చేతులు రావడంలేదని ఆవేదన చెందారు. గ్రామసర్పంచ్లు లేక గ్రామపాలన కుటుంపడుతోందని అందుకే ఎన్నికలు జరుపాల్సి వస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలలో బిజెపి గెలవడం ఒక కలగా ఆయన అభివర్ణించారు. బిసి రిజర్వేషన్కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని అన్నారు.

Read also: బిల్లులు లేని సిగరెట్లు పట్టివేత – రూ.20 లక్షల సరుకు స్వాధీనం

BJP is blocking BC reservation

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సందేశం:మహేష్ కుమార్

బిసి రిజర్వేషన్(MLC Mahesh Kumar) ఇచ్చే ప్రక్రియ కాంగ్రెస్పార్టీ ఆపలేదని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారమాత్రమే కాకుండా, స్వాతంత్య్ర కోసం పోరాడిన వీరుల కలలు, త్యాగాలు, సంకల్పాలను ప్రతిబింబించే మహత్తర గ్రంథమని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విలేఖరులతో మాట్లాడతూ రాజ్యాంగ వత్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం మన ప్రజాస్వామ్య వ్యవస్థకు, సమాఖ్యస్పూర్తికి బలమైన పునాది అని ఆయన అభిప్రాయపడ్డారు. లౌకికత, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా పని చేస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్(B.R. Ambedkar) సహా అన్ని రాజ్యాంగ నిపుణుల సలహాలు సంప్రదింపులు జరిపి సమాఖ్య స్పూర్తి, బహుభాషల పుట్టినిళ్లైయిన భారత దేశంలో అందరికి ఆచరణయోగ్యమైన రాజ్యాంగంను మనకు అందించారిన అన్నారు. బిఆర్ అంబెద్కర్కు నివాళి తెలపడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని గుర్తుచేశారు.. అనేక భాషలు, సంస్కృతులు, మతాలున్న భారత దేశాన్ని ఐక్యంగా ముందుకు నడిపించే శక్తిగా రాజ్యాంగాన్ని గుర్తించాలనీ అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య భవిష్యత్తు పట్ల హెచ్చరికలు

నేటి యువతకు రాజ్యాగాన్ని చదవటం, అర్ధం చేసుకోవటం అత్యంత కీలకమని, ప్రజాస్వా మ్యంలో పౌర బాధ్యత ఓటు వేయడం మాత్రమే కాకుండా రాజ్యాంగ విలువలను గౌరవించి వాటిని ఆచ రణలో పెట్టుకోవడమే నిజ్య నిజమైన బాధ్యతనని ఆయ న గుర్తుచేశారు. రాజ్యాంగ దినోత్సవం మన ప్రజాస్వామ్య భవిష్యత్తు కోసం రాజ్యాంగ విలు వల పరిరక్షణకు అంకితభావాన్ని పునరుద్ఘా టించుకునే సమయం అని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. దేశ అభివృద్ధి పథంలో రాజ్యాంగమే శాశ్వత రాజ్యాంగమే శాశ్వత మార్గదర్శి అని ఆయన అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగ వత్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ను స్మరించుకుంటు నివాళులు అర్పింస్తున్నామని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం యావత్ ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగం మనదని అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందనితెలిపారు.. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయ త్నం చేస్తున్నాయనీ హెచ్చరించారు. గాంధీ. నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందని అన్నారు. విద్యా వంతులు, మేధావులు ఆరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. భారత రాజ్యాంగం ఇతర దేశాలకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

CivicResponsibility ConstitutionDay DrBRAmbedkar IndianConstitution MaheshKumarGoud RajyangaDinotsavam TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.