📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

MLC Kavitha: మా అన్నకు రాఖీ కడతా అందులో సందేహం లేదు

Author Icon By Anusha
Updated: August 6, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ సంస్కృతిలో సోదరుడు-సోదరి బంధం ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఈ పవిత్రమైన బంధానికి ప్రతీక రక్షా బంధన్ పండుగ. ప్రతి సంవత్సరం శ్రావణ మాస పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగలో సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడుతూ ప్రేమ, అనుబంధాన్ని వ్యక్తపరుస్తారు. ఈ సందర్భంలో సోదరుడు తన సోదరికి జీవితాంతం రక్షణగా, అండగా ఉంటానని హామీ ఇస్తాడు. ఈ పండుగలో పేద, ధనిక, సామాన్యులు, ప్రముఖులు అనే తేడా ఉండదు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక దినాన్ని ఆనందంగా జరుపుకుంటారు.రాఖీ పండుగ అంటే ప్రతి ఒక్కరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చిన్నప్పటి నుంచీ సోదరుడు-సోదరి మధ్య ఉన్న తీపి తగాదాలు, ఆటపాటలు, అనుబంధం ఈ రోజు మరింత బలపడుతుంది.

రాజకీయ నాయకులు

ఈ సందర్భంగా సోదరీమణులు రాఖీ కట్టి, తమ సోదరుని ఆయుష్షు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు. సోదరుడు తన చెల్లికి బహుమతి ఇచ్చి, జీవితాంతం రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు.ప్రతి పండుగలా రాఖీ పండుగ (Rakhi festival) కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ సందర్భంగా చేసే పోస్టులు అభిమానుల్లో చర్చనీయాంశమవుతాయి. ఈ జాబితాలో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఉంటారు. ప్రతి ఏడాది ఆమె తన అన్న, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టి సోదరభావాన్ని వ్యక్తం చేస్తారు.

MLC Kavitha:

సందేహం చాలా

అయితే గత సంవత్సరం పరిస్థితులు కవితకు రాఖీ కట్టే అవకాశం ఇవ్వలేదు. మద్యం కేసులో ఆమె అరెస్ట్ అవడంతో జైల్లో ఉండటంతో కవిత తన అన్నకు రాఖీ కట్టలేకపోయారు. ఈ విషయం అభిమానులను కలచివేసింది. ఈసారి రాఖీ పండుగ సమయం దగ్గరపడుతుండటంతో కవిత కేటీఆర్‌ (KTR) కు రాఖీ కడతారా లేదా అనే సందేహం చాలా మందిలో కలిగింది.ఈ అనుమానాలకు కవిత తాజాగా బదులిచ్చారు. “నూటికి నూరు శాతం మా అన్నకు రాఖీ కడతాను. రాజకీయం వేరు, రక్త సంబంధం వేరు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మా అన్నకు రాఖీ కట్టకపోవడం అసాధ్యం. గత సంవత్సరం నేను జైల్లో ఉండటంతో రాఖీ కట్టలేకపోయాను. కానీ ఈసారి కచ్చితంగా మా అన్నకు రాఖీ కడతాను” అని ఆమె స్పష్టం చేశారు.

ఫోటోను షేర్

కేటీఆర్ తన చెల్లి కవితని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. నువ్వు ఈ ఏడాది నాకు రాఖీ కట్టలేకపోవచ్చు. కానీ కష్టసుఖాల్లో ఎల్లప్పుడు నేను నీ వెన్నంటే ఉంటాను అంటూ కేటీఆర్ భావోద్వేగ పోస్ట్ చేశారు. దీనితో పాటుగా, గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను, అలానే ఆమె అరెస్టు సమయంలో కేటీఆర్ పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేశారు. మరి ఈసారి వీరి రక్షాబంధన్ వేడుకలు ఎలా జరగనున్నాయో చూడాలి అంటున్నారు. ఇక కవిత విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు మీద 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నారు.

కవిత రాజకీయాల్లోకి ఎప్పుడు ప్రవేశించారు?

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో కవిత రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2006లో “తెలంగాణ జాగృతి” సంస్థను స్థాపించి ఉద్యమాన్ని బలపరిచారు.

కవిత ఎలాంటి పదవులు చేపట్టారు?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.2014లో నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం ఎమ్మెల్సీగా (MLC) కొనసాగుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/indiramma-houses-rs-700-crores-paid-to-beneficiaries-of-indiramma-houses-scheme/telangana/526944/

Breaking News Kavitha KTR sibling love Kavitha Raksha Bandhan celebrations latest news MLC Kavitha KTR bond Rakhi festival traditions India Telangana political family moments

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.