📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kavitha: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఎంఎల్సి కవితకు ఉద్వాసన

Author Icon By Vanipushpa
Updated: July 17, 2025 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టిజిబిజికెఎస్ ఇంచార్జ్ గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్: బిఆర్ఎస్(BRS) అనుబంధ సింగరేణి కార్మిక సంఘం(Singareni) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిజిబిజిఎస్) నుంచి ఎంఎల్సి కల్వకుంట్ల కవిత(MLC Kavitha)ను తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు టిజిబిజికెఎస్ వ్యవహారాల ఇంచార్జ్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు టిజిబిజికెఎస్ను కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం కెటిఆర్తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు సమావేశమయ్యారు.

Kavitha: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఎంఎల్సి కవితకు ఉద్వాసన

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం

ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎంఎల్ఎలు, ఇంఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇంచార్జి ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని ప్రకటించారు.

సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం

కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలా పాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపో వాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎ త్తున పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని దిశానిర్ధేశం చేవారు. పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలని కెటిఆర్ సూచించారు .

ఎమ్మెల్సీ కవిత ఎవరు?

2021 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి కవిత రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె 2022 జనవరి 19న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఎమ్మెల్సీ అని ఎవరిని అంటారు?

శాసన మండలి సభ్యుడిని సాధారణంగా MLC అని పిలుస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Bandh : జులై 23న తెలంగాణ లో స్కూల్స్, కాలేజీలు బంద్

#telugu News BRS Politics Coal Miners Union Kavitha Defeat Kavitha MLC Latest News Breaking News Singareni Elections Telangana news Telangana politics Trade Union Politics TRS News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.