📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

MLC Kavitha: జగదీష్ రెడ్డిపై ఎంఎల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: August 3, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, గత కొంతకాలంగా పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె బహిరంగంగానే విమర్శలు చేయడం, లేఖలు రాయడం, జాగృతి సంస్థను మళ్లీ యాక్టివ్ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె చేసిన సంచలన కామెంట్లు బీఆర్‌ఎస్‌లో కొత్త చర్చలకు దారి తీసాయి.తెలంగాణ జాగృతిని మళ్లీ సజీవం చేస్తూ, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న కవిత ఇటీవల కేసీఆర్‌ (KCR) కు లేఖ రాశారు. ఆ లేఖలో పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ లేఖ లీక్ కావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ, తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే ఎపిసోడ్ కొనసాగుతుండగానే మరోసారి కవిత సంచలన స్థాయిలో స్పందించారు.

ఎవరూ స్పందించకపోవడంపై

ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తనపై చేసిన విమర్శలపై పరోక్షంగా ఘాటు బదులిచ్చారు. ఇవాళ ఉదయం తన నివాసంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కవిత (Kavitha), తమపై దాడి చేసినా పార్టీ నాయకులు ఎవరూ మాట్లాడకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డపై ఎవరైనా దారుణమైన వ్యాఖ్యలు చేసినా బీఆర్‌ఎస్ సోదరులు మౌనంగా ఉండటం విచారకరమని అన్నారు.తనపై విమర్శలు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేసినా పార్టీ సోదరులు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యల వెనుక పార్టీలోని ఓ పెద్ద నాయకుడి కుట్ర ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. జగదీష్ రెడ్డిని ‘ లిల్లీపుట్ ‘ అంటూ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

MLC Kavitha

పిల్ల నాయకులు కూడా నా గురించి

కేసీఆర్ లేకపోతే ఈ లిల్లీపుట్‌కు గుర్తింపు ఎక్కడిది. అసలు తెలంగాణ ఉద్యమంలో వాళ్ల పాత్ర ఏంటి..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని బ్రష్ఠుపట్టించి చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఒక్కడే గెలిచిండు. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే అసలు ఈ లిల్లీపుట్‌కు అడ్రస్ ఎక్కడిది. నా గురించి అంత నీచంగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలుస్పందించకపోవటం దారుణం. ఓ పెద్ద నాయకుడు దీని వెనక ఉన్నాడు. నిన్నకాక మెున్న వచ్చిన పిల్ల నాయకులు కూడా నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు.’ అంటూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారి తీశాయి.

కవిత ఎప్పుడు జన్మించారు?

కవిత 13 మార్చి 1978న తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో జన్మించారు.

కవిత విద్యార్హతలు ఏమిటి?

కవిత మెకానికల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ పూర్తి చేసి, తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/miryalaguda-marijuana-batch-in-miryalaguda-fear-among-locals/crime/525147/

Breaking News BRS internal politics BRS Politics Jagadish Reddy controversy Kavitha comments on Jagadish Reddy Kavitha press meet KCR daughter Kavitha latest news Telangana Political News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.