📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest news: MLC Kavitha: తెలంగాణాకు కెసిఆర్ పాలన స్వర్ణయుగం

Author Icon By Saritha
Updated: October 22, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాళహస్తి : పదేళ్ళ కెసిఆర్ (KCR) పాలన తెలంగాణాకు స్వర్ణయుగం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శ్రీకాళి హస్తీశ్వరాలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతుదోష నివారణ పూజలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కుటుంబ సమేతంగా జరిపించుకున్నారు. ఆలయంలో నిర్వహించే ప్రత్యేక రాహుకేతు దోష నివారణ పూజలను ఆలయంలోని సహస్రలింగేశ్వరుని ఆలయం వద్ద వేదపండితులతో జరిపించారు. తరువాత స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శనం ఏర్పాటు చేసారు. తరువాత మృత్యుంజయ ఆలయం వద్ద వేదపండి తులచే ప్రత్యేకాశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ పదేళ్ళ పాలన స్వర్ణయుగంగా మారిందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. నేడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

Read also: రేపటి నుంచి 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం

MLC Kavitha: తెలంగాణాకు కెసిఆర్ పాలన స్వర్ణయుగం

ప్రజల సమస్యలపై త్వరలో యాత్ర ప్రారంభం – కవిత ప్రకటన

రాజకీయం గాను తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో యాత్ర చేపట్ట బోతున్నట్లు కవిత (MLC Kavitha) ప్రకటించారు. యాత్రలో ప్రజలతో మమేకమౌతున్నట్లు వివరించారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొని యాత్రను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ నిర్మాణాన్ని రానున్న రోజుల్లో ప్రజలే నిర్ణయిస్తారని కవిత అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి కెసిఆర్ కుమార్తె కల్వకుంట కవిత కుటుంబసభ్యులతో రాగా ఆమెకు మాజీ శాసనసభ్యుడు బియ్యపు మధుసూదనరెడ్డి సారధ్యంలో స్వాగతం పలికారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవనాయుడు, మాజీ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మైనారిటి నాయకులు పఠాన్ ఫరీదాఖాన్, అస్లాం, సాగిరాబీ, షర్మిలాఠాగూర్ తదితరులు స్వాగతం పలికారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Congress vs BRS Golden Era Telangana Kalvakuntla Kavitha KCR Governance Latest News in Telugu Rahuketu Pooja Srikalahasti Temple Telangana news Telugu News TRS Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.