MLA Yennam Srinivas Reddy: జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఎమ్మెల్యే యెన్నం లక్ష రూపాయల విరాళం

Read Time:  1 min
MLA Yennam Srinivas Reddy: జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఎమ్మెల్యే యెన్నం లక్ష రూపాయల విరాళం
FONT SIZE
GET APP
  • MLA Yennam Srinivas Reddy: జర్నలిస్టుల సంక్షేమానికి నేను సైతం అంటూ ఎమ్మెల్యే యెన్నం ముందగుడు
  • రూ. లక్ష చెక్కు అందజేత జర్నలిస్టుల సంక్షేమానికి తొలి అడుగు పడింది. అందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదిక అయింది. పాలమూరు జర్నలిస్టుల సంక్షేమానికి నేను సైతం అంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందడుగు వేశారు. ఇప్పటికే చెప్పిన విధంగా పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘానికి రూ. లక్ష చెక్కును గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా జర్నలిస్టుల సంక్షేమంలో అందజేశారు.

Read Also: Mehdipatnam Skywalk Height Issue: మెహిదీపట్నం స్కైవాక్ ఎత్తుపై విమర్శలు

Yennam Srinivas Reddy - ఆ మీటింగ్ తరువాత అన్ని బయటపడుతాయ్.. తొందరెందుకు? : యెన్నం  శ్రీనివాస్ రెడ్డి
MLA Yennam donates one lakh rupees to the journalists’ welfare fund

పాలమూరు జర్నలిస్టుల హర్షం

మాట ఇచ్చిన వారంలోపే ఆచరణలో చూపించి జర్నలిస్టుల పట్ల తనకు ఉన్న అభిమానాన్ని ఆప్యాయతను చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి వర్కింగ్ జర్నలిస్టును, అన్ని విభాగాల వారీగా సమీక్షించి అందరినీ కలుపుకొని, పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. యూనియన్లు, సంఘాలు భేషాజాలకు వెళ్లకుండా ప్రతీ జర్నలిస్టు సంక్షేమానికి సంఘం కృషి చేయాలని పేర్కొన్నారు. విధివిధానాలను పకడ్బందీగా రూపొందించి ఆపదలో ఉన్న జర్నలిస్టులను కాపాడుకోవాలని వారికి అండగా నిలవాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.