📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Breaking News – Matta Ragamayee : వరదనీటిని పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి

Author Icon By Sudheer
Updated: August 28, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సత్తుపల్లి నియోజకవర్గంలో రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ పరిస్థితిని సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి (Matta Ragamayee) స్వయంగా పరిశీలించారు. కాంగ్రెస్ నాయకుడు డా. దయానందాతో కలిసి జోరు వర్షంలోనూ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటవద్దని ఆమె హెచ్చరించారు.

జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు

సత్తుపల్లి మండలంలోని జాతీయ రహదారి 365BBపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిష్టారం వై జంక్షన్ వద్ద కిష్టారం చెరువు పొంగి రహదారిపైకి నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి వరద ప్రవాహాన్ని పరిశీలించి నీటిని మళ్లించే ప్రయత్నాలు చేపట్టారు. ఇదే కాకుండా కిష్టారం నుంచి చెరుకుపల్లి, యాతాలకుంట గ్రామాల మధ్య ఉన్న రహదారులు కూడా వరదనీటితో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సత్తుపల్లి సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్‌లో 98mm, కిష్టారం ఓపెన్ కాస్ట్‌లో 160mm వర్షపాతం నమోదైంది. భారీగా వరదనీరు గనుల్లోకి చేరడంతో జేవీఆర్, కిష్టారం ఓసీలలో దాదాపు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా, 2,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయి. ఈ వర్షాల కారణంగా సింగరేణికి భారీ నష్టం వాటిల్లింది.

https://vaartha.com/live-news-todays-latest-news-28-08-2025/live-news/536871/

Google News in Telugu MLA MLA Matta Ragamayee Rains sathupalli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.