📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

MLA Medipalli Satyam: బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే: వారిది ఫెవికాల్ బంధం

Author Icon By Anusha
Updated: July 28, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్ : బిజెపి, బిఆర్ఎస్ రెండు వేరువేరు కాదని మొదటి నుంచి చెబుతున్నామని, పదేళ్లుగా వాళ్ల మధ్య ఫెవికల్ బంధం ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) అన్నారు. ఆదివారం సిఎల్ఎపి కార్యాలయంలో మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ మద్దతు ఇచ్చినప్పుడే ఆ పార్టీల బంధం బయటపడింది. బిజెపిను బిజెపికి హోల్ సేల్ గా అమ్మడానికి కెటిఆర్ ఒప్పందం చేసుకున్నాడు. ఇడి సిబిఐ కేసులు వాళ్ళ కుటుంబ సభ్యుల పైన రాకుండా ఉంటే బిఆర్ఎస్ను బిజెపిలో విలీనం చేస్తామని అన్నారని సీఎం రమేష్ చెప్పారు.

పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదా

సిఎం రమేష్ ను కెటిఆర్ కలిసింది. నిజామా కదా చర్చలు జరిగింది వాస్తవం కదా అని నిలదీశారు. బిఆర్ఎస్ విలీనం కోసం చర్చలు వాస్తవమే అని బండి సంజయ్ అన్నారని సమాధానం చెప్పాలని అన్నారు. సిఎం రమేష్ (CM Ramesh) ను తీసుకువస్తా చర్చకు రండీ అని కెటిఆర్ను మంత్రి బండి సంజయ్ పిలిచారు. ఇంకా తేలుకుట్టిన దొంగల ఎందుకు ఉన్నావ్ కెటిఆర్ ఎప్పుడూ వెళ్తున్నవో చెప్పు అని కోరారు. పదేళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలదా ఇంకెన్నేళ్ళు మోసం చేస్తారు అని కెటిఆర్ ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల లో అవకతవకలు జరిగితే ఇడి, సిబిఐ వచ్చేవి కదా అని మేడిపల్లి సత్యం సందేహం వ్యక్తంచేశారు. అనేక కాంట్రాక్టులు ఆంధ్రా కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది మీరు.

MLA Medipalli Satyam: బిజెపి, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే: వారిది ఫెవికాల్ బంధం

బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేయాలని

8ఎంపీలు బిజెపి గెలవడానికి కారణం బిఆర్ఎస్ మాత్రమే అన్నారు. బిఆర్ఎస్ గంపగుత్తగా బీజేపీ కి ఓట్లు అమ్ముకున్నారు. బిఆర్ఎస్, బిజెపి ఒప్పందంలో భాగంగానే బిజెపి కి డమ్మీ అధ్యక్షుడిని నియమించారుపదేళ్లు దోచుకొని బిఆర్ఎస్ ను బిజెపికి అమ్మడానికి ప్రయ త్నాలు చేశారు. కవిత కూడా బిఆర్ఎస్ ను బిజెపి లో విలీనం చేయాలని ప్రయత్నం చేశారు అని చెప్పింది. పదేళ్లలో విద్యార్థులు, యూనివ్సిటీ లు, కాలేజీలు గుర్తుకురాలేదు. బిఆర్ఎస్ కి ఓటు వేస్తే మురిగిపోయినట్లే బిఆర్ఎస్ కి ఓటు వేస్తే బిజెపి కి వేసినట్లే.. ప్రజలు ఆలోచించాలి అన్నారు.

మెడిపల్లి నియోజకవర్గం నుండి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు?

మెడిపల్లి నియోజకవర్గం అనేది ప్రత్యేకమైన అసెంబ్లీ నియోజకవర్గంగా లేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలోని ఒక మండలంగా ఉంది. మెడిపల్లి ప్రాంతం ప్రస్తుతం మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

మేడిపల్లి ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి పనులు జరుగుతున్నాయి?

మెడిపల్లి లో మున్సిపల్ విభాగం పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వాటిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పార్కులు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సెంటర్లు నిర్మాణం ముఖ్యమైనవి.

Read Hindi News : hindi.vaartha.com

Read also : Nagole: షటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి

BJP Breaking News brs Choppadandi CLP office cm ramesh ED cases hyderabad ktr latest news Medipalli Satyam Telangana politics Telugu News Vice President elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.