Kaushik Reddy apology : పోలీసులకు క్షమాపణలు, కౌశిక్ రెడ్డి యూటర్నా?

Read Time:  1 min
Kaushik Reddy apology
Kaushik Reddy apology
FONT SIZE
GET APP

Kaushik Reddy apology : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యల వివాదం తాజాగా మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆయన, తన మాటలు ఉద్దేశపూర్వకమైనవి కావని స్పష్టం చేస్తూ పోలీసులకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలంటూ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

కరీంనగర్ సీపీపై కులం ప్రస్తావనతో చేసిన (Kaushik Reddy apology) వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో, తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సంఘం, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి స్పందిస్తూ, పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి గౌరవం ఉందని తెలిపారు.

Tamil Nadu Elections : విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

ఈ వివాదానికి కారణాలను వివరిస్తూ, సమ్మక్క–సారలమ్మ జాతరకు కుటుంబంతో వెళ్తున్న సమయంలో కొందరు అధికారులు కావాలని అడ్డుకున్నారని అన్నారు. ఆ సమయంలో ఏర్పడిన ఒత్తిడి, ఆవేశం కారణంగానే తన నోరు జారిందని, దీన్ని వేరేలా అర్థం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

అలాగే, ఈ అంశాన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కొందరు కావాలని పెద్దదిగా చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ వివాదాన్ని ఇకపై కొనసాగించకుండా ఇక్కడితో ముగించాలని కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.