📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Miss World: మొదలైన అందాల పోటీల సందడి

Author Icon By Sharanya
Updated: May 4, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రావమ్మా ముద్దుగుమ్మ.. భాగ్యనగరం మీకు స్వాగతం పలుకుతోంది అని తెలంగాణ ప్రజలు ఘనతతో మిస్ వరల్డ్ 2025 పోటీదారులను ఆహ్వానిస్తున్న దృశ్యాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం ఐటీ హబ్‌గా కాదు, అంతర్జాతీయ సంస్కృతుల కలయికగా, అందాల పోటీలకు కేంద్రంగా మారిపోయింది.

తెలంగాణలో మొదలైన అందాల పోటీ హడావుడి

ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగనున్నాయి. ప్రపంచంలోని 120 దేశాల నుంచి అత్యంత ప్రతిభావంతమైన, ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్న అందగత్తెలు ఈ పోటీలో పాల్గొననున్నారు. మొదటగా మిస్ కెనడా క్యాథరన్ మోరిసన్‌ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఆమెకు నుదుట బొట్టుపెట్టి, సంప్రదాయ నృత్యాలతో, హారతులతో, పూలమాలలతో తెలంగాణ ఆదరణను చాటింది. ఇప్పటికే మిస్‌వరల్డ్‌ సంస్థ CEO చైర్‌పర్సన్ జూలియా మోర్లీ, ప్రతినిధి కెర్రీ ఇప్పటికే చేరుకుని, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ, రేపు 120 దేశాల నుంచి పోటీదారులు, ప్రతినిధులు నగరానికి చేరుకుంటారు. భాగ్యనగర ప్రజల ఉత్సాహం, ప్రభుత్వ వినూత్న ఆలోచనలతో ఈ వేడుక అంతర్జాతీయ మద్దతును పొందుతోంది.

హైదరాబాద్‌లో హై లెవల్ భద్రత, గౌరవ ఆతిథ్యం

చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఎలాంటి లోపాలు లేకుండా భద్రతా ఏర్పాట్లు, హోటల్ వసతులు, రవాణా సేవలు అందించేందుకు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. హైదరాబాద్ వస్తున్నవారు తెలంగాణలో పర్యాటక ప్రదేశాలను సందర్శించేలా ఆయా ప్రదేశాలను సుందరీకరించాలన్నారు రామకృష్ణారావు ఇదిలా ఉంటే మిస్‌వరల్డ్‌ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రివ్యూ నిర్వహించనున్నారు.

తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం

ఈ పోటీలను కేవలం “అందాల ప్రదర్శన”గా కాకుండా, రాష్ట్రంలోని మెడికల్ టూరిజం, పర్యాటక ప్రాధాన్యత, ఆతిథ్య సంస్కృతి, సంప్రదాయ శిల్పకళలు, హ్యాండ్‌లూమ్స్, రెసిడెన్షియల్ ట్రావెల్‌తో కూడిన ఒక ప్రాముఖ్యమైన ప్రదర్శనగా తెలంగాణ ప్రభుత్వం ఈవెంట్‌ను మలచుకుంటోంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో AIG హాస్పిటల్ వేదికగా “మెడికల్ టూరిజం” ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి.

చార్మినార్‌లో హెరిటేజ్ వాక్

ఈ నెల 13న చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. మదీనా, పత్తర్‌గట్టి, గుల్జర్‌హౌస్, లాడ్‌బజార్, చౌమొహల్లా ప్యాలెస్‌ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. చార్మినార్ ప్రాంతం మళ్లీ పాతకాలపు గౌరవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటనుంది. మిస్ వరల్డ్ పోటీలను 150 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది తెలంగాణకు ఒక అరుదైన అవకాశం. ప్రపంచం ముందు తమ బ్రాండ్‌ను ప్రదర్శించుకునే దశగా మారింది ఇది. టూరిజం, కల్చర్, మెక్-ఇన్-తెలంగాణ స్పిరిట్, వైద్య వసతులు, ఆతిథ్య సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పోటీలు నిలిచే అవకాశం ఉంది.

Read also: Indiramma housing: ఇందిరమ్మ ఇళ్ల రెండో లిస్ట్ విడుదల

#BeautyWithPurpose #FashionAndCulture #Hyderabad #MissWorld2025 #MissWorldUpdates #telengana Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.