ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ 2025 పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈసారి ఈ అంతర్జాతీయ సుందరీ పోటీకి హైదరాబాద్ గర్వంగా వేదికగా మారింది. హైటెక్స్‌లో ఇవాళ (మే 31) సాయంత్రం 6:30 నుంచి అర్ధరాత్రి వరకు ఫైనల్ పోటీలు జరుగనున్నాయి. విశ్వసుందరి కిరీటం కోసం నాలుగు ఖండాలకు చెందిన 40 మంది అందగత్తెలు ఒకరితో ఒకరు పోటీపడనున్నారు.
ఇండియా తరఫున నందినీ గుప్తా రేసులో
ఈ భారీ పోటీలో భారత్ తరఫున నందినీ గుప్తా గెలుపు కోసం బరిలో ఉన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది నందినీ విజయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నందినీ ఇప్పటికే కొన్ని రౌండ్లలో తన ప్రతిభను చాటుతూ చాలా మంది జ్యూరీలను ఆకట్టుకున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ భారత్‌కు రావాలని ఎంతో మంది ఆకాంక్షిస్తున్నారు.
ప్రపంచ ప్రతినిధులతో హైదరాబాద్ మెరిసిపోతోంది
ఈ మెగా ఈవెంట్‌కు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరాంగనులతో పాటు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపార రంగ ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ మీడియా ఈ వేడుకను ప్రత్యేకంగా కవర్ చేస్తోంది. ప్రపంచ దృష్టి ప్రస్తుతం హైదరాబాద్‌పై ఉండడంతో రాష్ట్రానికి గ్లోబల్ స్థాయిలో గౌరవం కలగడం విశేషం. ఈ పోటీ ముగిసేలోపు కొత్త విశ్వసుందరిని ప్రకటించనుండగా, అందరూ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
Read Also : AP Nurse : ఏపీ నర్సు శుభావతికి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం