📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల

సీఎం పేరును మర్చిపోతున్న మంత్రులు

Author Icon By Anusha
Updated: February 19, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తనదైన శైలిలో పాలనలో దూకుడు చూపించాలని ప్రయత్నిస్తున్న రేవంత్‌కు, తాజాగా కొన్ని సంఘటనలు ఇబ్బందికరంగా మారాయి. ఆయన పేరు ప్రస్తావించాల్సిన సందర్భాల్లో, పలువురు ప్రముఖులు అతని పేరును మర్చిపోవడం, లేదా పొరబాట్లు చేయడం ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు ఒకపక్క ప్రజాక్షేత్రంలో రేవంత్ తన మార్కు పాలనతో దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో సాక్షాత్తు రేవంత్ క్యాబినెట్ మంత్రులే పేరు మర్చిపోవడం రేవంత్ కు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డిని గద్ద దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దగ్గరకు కూడా రానివ్వడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న వేళ సొంత పార్టీ నాయకుల తీరు రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇస్తుంది.

సోషల్ మీడియాలో చర్చ

పుష్ప-2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సీఎం పేరును మర్చిపోయినప్పటి నుంచి దీనిపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఆ వేడుకలో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పలకరించాల్సిన సందర్భంలో, రేవంత్ రెడ్డి పేరు గుర్తు పెట్టుకోలేకపోయారు. అది అక్కడితో సరిపోలేదు. ఆ తరువాత చంటి గాడు సినిమా ఫేమ్ బాలాదిత్య కూడా ఓ వేడుకలో రేవంత్ రెడ్డి పేరు చెప్పాల్సిన చోట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రస్తావించడం చర్చనీయాంశం అయ్యింది.తాజాగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పొరబాటు చేసి రేవంత్ రెడ్డి అని అనాల్సిన చోట సీఎం కేటీఆర్ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చ మొదలైంది.

కేసీఆర్ ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతినిధుల సభ లేదా బహిరంగ సభ నిర్వహణ విషయమై నిర్ణయం ప్రకటించే అవ కాశం ఉంది.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుండటంతో,ఇక రేవంత్ పాలనా లోపాల పైన నిరసనలకు దిగాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, హామీల అమలుకి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, భవిష్యత్ కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.ఇది ఇలా ఉంటే కేసీఆర్ సుమారు 14నెలలుగా ఫాంహౌస్ లో నే ఉంటూ దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని కేసీఆర్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదు.. గట్టిగా కొడతానంటూ రేవంత్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

#AlluArjunPushpa2 #CMNameMistake #JupallyKrishnaRao #PoliticalTrolls #PoliticalUpdates #RevanthReddyCM #TelanganaCM #TelanganaCongress #TelanganaPolitics Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.