📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medak District Development Review: అధికారులంతా ప్రజలతో మమేకం కావాలి.. మంత్రి వివేక్

Author Icon By Siva Prasad
Updated: March 6, 2026 • 8:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Medak District Development Review: జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని, అధికారులంతా ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజా పాలన నిర్వహణలో ఉమ్మడి మెదక్ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని, 99 రోజుల ప్రణాళికలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.

Read Also: Balka Suman: కేసీఆర్‌ను కలిసిన బాల్క సుమన్

Medak District Development Review: ముందస్తు ప్రణాళికలు – తాగునీటి సరఫరా

వేసవి కాలంలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తత్కాలిక పనుల కోసం అసెంబ్లీలో చర్చించి అనుమతులు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 10 థీమ్స్‌తో రూపొందించిన కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. నర్మెట్టలోని ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీని ప్రారంభించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తానని, రెసిడెన్షియల్ స్కూళ్లలో నీటి సమస్య లేకుండా చూడాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గుమ్మడిదలలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, సూర్య ఘర్ యోజన (సోలార్) పథకంపై రివ్యూ చేయాలని అధికారులను ఆదేశించారు.

సంక్షేమ పథకాలు – వ్యవసాయం

ప్రజా పాలనలో భాగంగా 6 గ్యారంటీలు ప్రజలకు అందేలా చూడాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించి లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులు లబ్ధి పొందేలా 30% పంట మార్పిడి చేయించాలని, అధిక ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పేదలకు నాణ్యమైన విద్యా, వైద్య సేవలతో పాటు రేషన్ కార్డ్స్, డిజిటల్ హెల్త్ కార్డ్స్ అందేలా చూడాలన్నారు.

Medak District Development Review: All officials should interact with the people.. Minister Vivek

ప్రజాప్రతినిధుల సూచనలు

మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రగతి ప్రణాళిక ఉండాలని, దుబ్బాకలో ఆర్డీఓ కార్యాలయం, కొత్త మండలాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి డీజిల్ తీసే స్వచ్ఛంద సంస్థకు సిద్దిపేటలో స్థలం కేటాయించాలని సూచించారు. ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ మహిళల హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలని, వైద్య పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు సంజీవ రెడ్డి, మైనంపల్లి రోహిత్ రావు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పలు స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు.

Medak District Development Review: అధికారుల సంసిద్ధత

All officials should interact with the people.. Minister Vivek

మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ 6 హామీల అమలుకు నోడల్ అధికారులను నియమించామని తెలిపారు. సిద్దిపేట కలెక్టర్ కే. హైమావతి, సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ 99 రోజుల కార్యచరణకు సిద్ధంగా ఉన్నామని, పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్లు నగేష్, మాధురి, అబ్దుల్ హమీద్ మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Medak Development Review Medak District Collector Pratima Singh Minister Vivek Venkataswamy Medak Tour Oil Palm Farming Telangana Praja Palana 99 Days Plan Telangana 6 Guarantees Implementation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.