📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్

Minister Uttam: ఎస్‌ఎల్‌బీసీ మూడేళ్లలో పూర్తి

Author Icon By Saritha
Updated: December 24, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నీటిపారుదల శాఖను చరిత్రలో నిలిచిపోయేట్లు చేస్తా: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్ : ఎస్‌ఎల్‌బీసీ రాబోయే మూడేళ్లలోనే పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండకు నీటిని ఇస్తామని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండకు జీవనరేఖలాంటి కృష్ణానదిని ఆంధ్రకు ధారదత్తంచేసి కుట్రలు చేసిన ఘనులు (Minister Uttam) కెసిఆర్, హరీష్ రావులని తెలంగాణ నీటిపారుదల పౌర సరఫరాల శఖమంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ కెసిఆర్ హయాంలో శ్రీశైలం నుంచిరోజుకు 13.35 టిఎంసిల నీరు తరలించు కొనిపోయే మౌలిక వసతులు నిర్మాణం చేయబడ్డాయని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ 727 టిఎంసిలు తరలించుకుపోతే కెసిఆర్(KCR) హయంలో 1442టిఎంసిల నీరు అక్రమంగా తరలించుకుపోయిందని ఆవేదన చెందారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు కెసిఆర్ ప్రభుత్వం సిడబ్ల్యుసికి రూ.55.86 కోట్లు అంచనా వ్యయం అవుతోందని డిపిఆర్ పేర్కొందని అందులో ఆయన ఖర్చుచేసింది 27 వేలకోట్ల రూపాయలైనప్పుడు ఎలా 90 శాతం పనులు పూర్తిచేశారని కేవలం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కు గత ప్రభుత్వం 27 వేలకోట్లు ఖర్చుచేసి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వ లేదని ఆరోపించారు.

Read Also: MP DK Aruna: విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం

నీటి ప్రాజెక్టులపై బిఆర్ఎస్‌పై మండిపాటు

బిఆర్ఎస్ నాయకులు(Minister Uttam) దుర్మార్గంగా బరితేగించి అబద్ధాలు చెప్తున్నారని దుయ్య బట్టారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం రెండేళ్లలో 7వేల కోట్లు ఖర్చు చేసామని ఆయన వివరించారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం ఏ అనుమతులు లేవని కెసిఆర్ అబద్ధాలు చెప్పారని తెలిపారు. పిఆర్ఎల్ఎఎస్కు 45 టిఎంసిలకి ఒప్పుకున్నారు. అనేది అవాస్తవమని అన్నారు. హరీష్ తెలివితో మాయమాటలు చెప్తున్నారు. హరీష్ రావు విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నామని చెప్పారు. కెసిఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టా లని లేదు. 2020లో సెంట్రలక్కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, ఎస్ఎల్ బిసి డిండికి నీళ్లు అడుగలేదు. పదేళ్లలో బిఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది.1.83 లక్షల కోట్లు ఇరిగేషన్కు ఖర్చు బిఆర్ఎస్ పాలనలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టలతోనే నీళ్లను పంపిణి చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీకి కెసిఆర్ సహకరించారు.

మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశాం. వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్న. మా ప్రభుత్వంలో పాలమూరు కు ఖర్చుచేసిన 7వేల కోట్ల లెక్కలు చెప్తం. హరీష్ రావు కమిషన్లు అంటున్నారు… మీ అలవాట్లు మాకు లేవు. ఏదో అద్భుతాలు చేసినట్లు కెసిఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉంటాయి. అసెంబ్లీలో నిబంధనల ప్రకారం నడుస్తుంది. పిపిటికి అవకాశం ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చామని చెప్తారా? అని ప్రశ్నించారు. నీటిపారుదలశాఖ ను చరిత్రలో నిలిచిపోయేలా నిలుపుతామని తెలిపారు. డిండి ప్రాజెక్టుకు సోర్స్ మేం ఇచ్చామని ఏదుల్ల నుంచినీటి వసతి కల్పించే ప్రతిపాదన ఇటీవల చేశామని కెసిఆర్ ఆ పనిచేయలేదని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu Nalgonda water issue Palamuru Rangareddy lift irrigation SLBC project Telangana Irrigation Telugu News uttam kumar reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.