📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Minister Tummala: పత్తి రైతులను ఆదుకునేందుకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Author Icon By Aanusha
Updated: October 26, 2025 • 9:33 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ పత్తి రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ శాఖ నుంచి తాజా సమాచారం వెలువడింది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అత్యధిక వర్షాలు పత్తి రైతులను తీవ్ర ఇబ్బందిలో పడేశాయి. తెలంగాణ పత్తి రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Minister Tummala) కీలక ఆదేశాలు జారీ చేశారు.

DCC Meet: తెలంగాణ కాంగ్రెస్ డీసీసీ నియామకంపై కసరత్తు!

శనివారం సచివాలయంలో వివిధ పంటల కొనుగోళ్లపై ఉన్నతాధికారులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోళ్లపై కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి.. సాధారణంగా పత్తిలో తేమ శాతం 8-12 శాతం వరకు ఉండాలనే నిబంధనను సడలించాలని సీసీఐ అధికారులకు సూచించారు. 

వర్షాల నేపథ్యంలో తడిసిన పత్తిని రైతులు ఆరబెడుతున్నా తేమ శాతం తగ్గడం లేదని.. 12 శాతం కంటే ఎక్కువ తేమ ఉన్నా కూడా మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. రైతులు దళారుల వద్దకు వెళ్లి మోసపోకుండా, కేవలం సీసీఐ కొనుగోలు కేంద్రాలలోనే పత్తి అమ్మకాలు జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు.

Minister Tummala

నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని

పత్తిలో తేమ శాతంపై, అలాగే కొనుగోలు ప్రక్రియలో ఉన్న ‘ఎల్1, ఎల్2 మ్యాపింగ్’ విధానంపైనా రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. ఈ-నామ్ (e-NAM) సర్వర్‌లో ఏర్పడుతున్న సమస్యతో కొన్ని జిల్లాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలకు నియమించిన నోడల్ అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని మంత్రి నిర్దేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా అవుతున్న మొక్కజొన్నను నిరోధించాలని మార్కెటింగ్‌ అధికారులను మంత్రి ( Minister Tummala) ఆదేశించారు. 

 స్థానిక రైతులు నష్టపోకుండా అక్రమ రవాణాను కట్టడి చేయాలని స్పష్టం చేశారు. మొత్తంగా, రైతులు నష్టపోకుండా ప్రతి గింజకూ మద్దతు ధర దక్కేలా, కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక పత్తి కొనుగోళ్ల తర్వాత మూడ్రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news telangana cotton news Telugu News tummala nageshwar rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.