📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Minister Tummala Nageswara Rao -దేశానికి సీడ్ హబ్ గా తెలంగాణ

Author Icon By Anusha
Updated: October 1, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ : భారతదేశపు సీడ్ హబ్ గా తెలంగాణ మారిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు (Minister Tummala Nageswara Rao) అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించీన ఇండియా-ఆఫ్రికా సీడ్ సమ్మిట్-2025 (India-Africa Seed Summit-2025) లో మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాన్ని తెలంగాణ నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, ఆధునిక పరిశోధన, ప్రాసెసింగ్, నిల్వ సదుపాయాలతో పాటు కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని అన్నారు. అలాగే రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా (Rythu Barosa) తో పాటు.

నేరుగా సబ్సిడీ జమ చేయడం ద్వారా

రైతుల ఖాతాలో నేరుగా సబ్సిడీ (subsidy) జమ చేయడం ద్వారా వారు తమకు నచ్చిన నాణ్యమైన విత్తనాన్ని కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ విధానం ద్వారా పారదర్శకత పెరిగి, రైతును శక్తివంతంగా మార్చడానికి దోహదం చేస్తుందని తెలిపారు. ఆఫ్రికా దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే, నాణ్యమైన విత్తనాల వినియోగం పెరిగి ఉత్పాదకత, ఆహార భద్రత,గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు.

Minister Tummala Nageswara Rao

సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం

ఇటువంటి సమ్మిట్ భారత్-ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయరంగం (Agriculture) లో సంబంధాలను బలోపేతం చేసే వేదికగా ఈ సమ్మిట్ నిలుస్తోందని పేర్కొన్నారు.కేవలం వాణిజ్యంపై కాకుండా, సీడ్ డిప్లొమసీ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించడం, శాస్త్ర పరిజ్ఞానం పంచుకోవడం, సుస్థిరమైన వ్యవసాయంనకు భవిష్యత్తులో పరస్పరం కలిసి పనిచేయడం కోసం ఈ వేదిక ఒక వారధిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/n-ramchandra-rao-60-percent-of-posts-in-the-party-are-for-new-people/telangana/545693/

Breaking News hyderabad India-Africa Seed Summit 2025 latest news Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.