అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఖమ్మం: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజాజీవనం స్పందించిపోయింది. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు హెచ్చరించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది ఉమ్మడి జిల్లాను ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణం నష్టం జరగకుండా చూడాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి శ్రీనివాస్ రెడ్డిలు ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు విజప్తి చేశారు.
కాలువలకు గళ్ళు పడకుండా ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంత ప్రజానీకాన్ని మైదాన ప్రాంతా లకు తరలించాలని వరద నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లను కోరారు. ఉద్యోగులు అధికారులు ఎవరికి సెలవులు ఇవ్వద్దని అందరూ విధి నిర్వహణలో ఉండాలని హితవు పలికారు చెరువులు కుంటలు కాలువలకు గళ్ళు పడకుండా ఎప్పటికప్పుడు నీటిపారుదల శాఖ (Irrigation Department) పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా చెరువులు కుంటలు కాలువలకు గళ్ళు పడితే వెంటనే పూడ్చివేయాలని వివరించారు. ఖమ్మం జిల్లాలో 39 మిల్లీమీటర్ల వర్షపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.
లోతట్టు ప్రాంత వాసులు వెంటనే ఖాళీ చేయాలన్నారు
ఉమ్మడి జిల్లాలోని ఎర్రుపాలెం మండలంలో 54 మిల్లీమీటర్లు నేలకొండపల్లిలో 16.4 నగర్లో 16.2 ముదిగొండలో 13.4 పినపాకలో 27.3 ఇల్లందులో 15 మణు గూరులో 24, దమ్మపేటలో 40 ఇల్లందులో 15.3 మిల్లీమీటర్ల చొప్పున వర్షపా తం నమోదయింది మున్నేరు నీటి ప్రవాహం పెరగటంతో ఖమ్మం సీపీ సునీల్ దత్ ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో పాటు అధికార యంత్రాంగం ఆ ప్రాంతాలను పరిశీలించి లోతట్టు ప్రాంత వాసులు వెంటనే ఖాళీ చేయాలన్నారు. ప్రధా నంగా ఇరిగేషన్ ప్రాజెక్టులైన పాలేరు వైరా లంకాసాగర్ బేతపల్లి తాలిపేరు ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి, కొన్ని ప్రాంతాలలో సాగులో ఉన్న వరి పొలాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తుమ్మల నాగేశ్వరరావు ఏఏ పదవులు నిర్వహించారు?
ఆయన పలు సార్లు ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా పనిచేశారు. రవాణా శాఖ, రోడ్లు, భవనాల శాఖ, జల వనరుల శాఖ వంటి విభాగాలను మంత్రిగా నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో ఆయన ప్రాధాన్యం ఏమిటి?
ఖమ్మం జిల్లాలో ఆయనకు గట్టి రాజకీయ పట్టుంది. అభివృద్ధి పనులు, రహదారి నిర్మాణం, నీటి ప్రాజెక్టులు వంటి అంశాలలో చురుకుగా వ్యవహరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: