हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Minister Sridhar Babu: ఇక డ్రోన్ల తయారీ

Sushmitha
Telugu News: Minister Sridhar Babu: ఇక డ్రోన్ల తయారీ

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) మాట్లాడుతూ, తెలంగాణను డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అడ్వాన్స్‌డ్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (Advanced Unmanned Aerial Systems) మరియు డిఫెన్స్ ఇన్నోవేషన్‌లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా మార్చేలా ఎకోసిస్టమ్‌ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో డ్రోన్ మాన్యుఫ్యాక్చరింగ్ మరియు టెస్టింగ్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు.

Read Also: TG: తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు

Minister Sridhar Babu
Minister Sridhar Babu Now manufacturing drones

మంగళవారం, జేఎస్‌డబ్ల్యూ (JSW), షీల్డ్ ఏఐ (Shield AI) సంయుక్తంగా రూ. 850 కోట్లతో మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చర్ క్లస్టర్ (ఈఎంసీ)లో ఏర్పాటు చేయనున్న జేఎస్‌డబ్ల్యూ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ (UAV) ఫెసిలిటీ భూమి పూజకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్ సిస్టమ్స్, ఏఐ అనేవి ఇకపై భవిష్యత్తు సాంకేతికతలు కావని, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థగా మారాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమన్నారు.

డిఫెన్స్ మార్కెట్ విలువ, ఉద్యోగాలు మరియు టార్గెట్లు

2030 నాటికి దేశీయ డిఫెన్స్ యూఏవీ, డ్రోన్ మార్కెట్ విలువ 4.4 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను రాష్ట్రానికి అనుకూలంగా మార్చుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఎల్బిట్ సిస్టమ్స్, షీబెల్ లాంటి అంతర్జాతీయ డిఫెన్స్ దిగ్గజ సంస్థల తయారీ కేంద్రాలు హైదరాబాద్‌లో ఉండటం రైజింగ్ తెలంగాణకు (Telangana) నిదర్శనమన్నారు.

ఈ 16 ఎకరాల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏటా 300 వరకు వీబీఏటీ (VBAT) డ్రోన్లు తయారవుతాయన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుందని, ప్రొడక్షన్, రీపేర్, టెస్టింగ్… ఇలా అన్ని ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కొత్తగా 300 మందికి హై-వాల్యూ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్ ఫౌండర్ పార్ట్ జిందాల్ తదితరులు పాల్గొన్నారు.

Minister Sridhar Babu

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ (Rising Global Summit) 2047 హైదరాబాద్ వేదికగా జరగనుంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా, తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా ఈ సమ్మిట్ ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఆదేశించారు.

మంగళవారం ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న ఈ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా పరిశీలించారు. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పని చేయాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు. విభాగాల వారీగా అప్పగించిన బాధ్యతలు, వాటి పురోగతిపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్షించారు. వివిధ దేశాలతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్, అతిథులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. పార్కింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఈ సమ్మిట్ వేదిక వద్ద నుంచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 5వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేసి, 6వ తేదీన డ్రై రన్ కండక్ట్ చేయాలని ఉన్నతాధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీలో ఈ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతను సైతం కట్టుదిట్టం చేసేందుకు డీజీపీ శివధర్ రెడ్డి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870