📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: TG: మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

Author Icon By Aanusha
Updated: October 29, 2025 • 9:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ (TG) రాష్ట్రం ఇప్పుడు భారతదేశ వైమానిక పరిశ్రమలో మరో ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. దేశంలోని ఏరో ఇంజిన్ తయారీ రంగంలో అగ్రస్థానం దక్కించుకోవాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రాన్ని “ఏరో ఇంజిన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”గా తీర్చిదిద్దేందుకు 2030 నాటికి సమగ్ర రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు.

Read Also: Anganwadi Jobs : అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క

తాజాగా, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ (Safran Aircraft Engines) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్”ను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ అత్యాధునిక కేంద్రం రూ. 425 కోట్ల పెట్టుబడితో నిర్మించబడింది. ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే సుమారు 500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “హైదరాబాద్ కేవలం సిటీ ఆఫ్ పెరల్స్ మాత్రమే కాదు… దాన్ని సిటీ ఆఫ్ ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్‌గా మలుస్తాం.

2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లోనే

రాష్ట్రాన్ని గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అన్నారు.రాష్ట్రంలోని ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.30,742 కోట్ల ఎగుమతులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు.

ఇది తెలంగాణలో ఈ రంగం సాధించిన విశేష వృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.ఈ కొత్త కేంద్రంలో ఎయిర్‌బస్, బోయింగ్ వంటి అంతర్జాతీయ సంస్థల కోసం లీప్ ఇంజిన్లకు అవసరమైన బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపొనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్స్ (రోటేటివ్ కాంపొనెంట్) ను తయారు చేయనున్నారు.

ఏరోస్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ మ్యాప్‌పై

టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ మాట్లాడుతూ, “ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపొనెంట్స్ తయారీ కేంద్రం భారతదేశంలోని అధునాతన తయారీ సామర్థ్యానికి చిహ్నం.

మా నిబద్ధత, గ్లోబల్ స్థాయి నైపుణ్యానికి ఇది నిదర్శనం” అన్నారు.తెలంగాణ (TG) ప్రభుత్వం పరిశ్రమల వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని తీసుకుంటున్న చర్యలతో, రానున్న సంవత్సరాల్లో రాష్ట్రం ఏరోస్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ మ్యాప్‌పై ప్రముఖ స్థానాన్ని సంపాదించనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

aero engine manufacturing latest news Minister Sridhar Babu Safran Aircraft Engines Tata Advanced Systems Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.