తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పుడు కేవలం టెక్నాలజీ హబ్‌గా మాత్రమే కాకుండా, ప్రపంచ భద్రతకు, బాధ్యతాయుతమైన ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు. హైదరాబాద్ నగరం త్వరలోనే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇన్నోవేషన్ సెంటర్’గా ప్రపంచ ఉత్పత్తులు రూపుదిద్దుకునే AI కమాండ్ సెంటర్‌గా అవతరించబోతుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Bhudhar App : రైతుల కోసం ‘భూధార్” యాప్ తీసుకొస్తున్న తెలంగాణ సర్కార్
2నెలల్లో AI యూనివర్సిటీ ప్రారంభం: మంత్రి
సోమవారం హైదరాబాద్‌లో ప్రముఖ సంస్థ కోవాసెంట్ తమ కొత్త AI ఇన్నోవేషన్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) చేతుల మీదుగా ప్రారంభించింది. మరో 2నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీని ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ చదువులు పూర్తిచేసే విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఏఐ సాంకేతికతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: