📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Minister Sridhar Babu:ఏరో ఇంజిను రాజధానిగా తెలంగాణ

Author Icon By Sushmitha
Updated: October 29, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: 2030 నాటికి తెలంగాణను దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu) పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మరియు సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్(Aircraft) ఇంజిన్స్ సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రోటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంత్రి మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

Read Also: Montha Cyclone: మొంథా తుపాను వల్ల 40 లక్షల మంది ప్రభావితం

ఏరోస్పేస్ రంగంలో అద్భుత వృద్ధి

తెలంగాణను గ్లోబల్ ఏరోస్పేస్ డిఫెన్స్ స్పేస్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలను మంత్రి ఈ సందర్భంగా వివరించారు. హైదరాబాద్ అంటే కేవలం ‘సిటీ ఆఫ్ పెరల్స్’ మాత్రమే కాదని, ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్ నగరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో ₹15,900 కోట్లు ఉండగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లోనే ₹30,742 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఈ వృద్ధి రేటు తమ ప్రభుత్వ హయాంలో ఈ రంగం సాధించిన ప్రగతికి నిదర్శనమన్నారు.

ఫెసిలిటీ ప్రయోజనాలు, పెట్టుబడులకు ఆహ్వానం

ఈ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్, లో-ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్‌ వంటి కాంపోనెంట్లు తయారవుతాయి. ఫలితంగా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. “విమాన ప్రయాణ భవిష్యత్తును నిర్మించాలనుకుంటే, దానిని తెలంగాణలో నిర్మించండి” అని ఈ వేదికగా అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు మంత్రి పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, ఎమ్మార్వో, స్పేస్, డ్రోన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు.

ఆదిభట్లలో ప్రారంభించిన కొత్త ఫెసిలిటీ దేనికి సంబంధించింది?

ఏరో ఇంజిన్ రోటేటివ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించింది.

ఈ ప్రాజెక్టులో పెట్టుబడి ఎంత?

టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) మరియు సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా ₹425 కోట్ల పెట్టుబడి పెట్టాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Duddilla Sridhar Babu Google News in Telugu Latest News in Telugu manufacturing facility. Safran Engines Tata Advanced Systems Telangana Aerospace Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.