📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Seethakka- మేడారం జాతరను మహా వైభవంగా నిర్వహిస్తాం- మంత్రి సీతక్క

Author Icon By Sharanya
Updated: August 22, 2025 • 11:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఆదివాసీ గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం ఎన్నడు లేని విధంగా ఈ దఫా రూ.150 కోట్లు ఖర్చు చేసిన్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. హైదరాబాద్ సచివాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు.

News Telugu:

జనవరి 22 నుండి 31 వరకు మేడారం జాతర

మేడారం (Medaram) సమ్మక్కసారలమ్మ జాతర వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, వచ్చే ఏడాది మేడారం సమ్మక్కసారలమ్మ జాతర జనవరి 22 నుండి 31 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్ల నిధులు విడుదల చేసిందని వెల్లడించారు. జాతర కోసం శాశ్వత పనులు చేపడుతున్నామని, జంపన్న వాగు నుంచి మేడారం ప్రాంగణం వరకు డబుల్ రోడ్లు, రోడ్ల వెడల్పు, డివైడర్లు, అలాగే 29 ఎకరాల దేవాదాయ శాఖ భూమిలో స్మృతివనం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, భద్రత కోసం 12 వేల మంది పోలీస్ సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. 13వ శతాబ్దపు ఈ చారిత్రక జాతరను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) మాట్లాడుతూ.. సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.105 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.150 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆదివాసి పూజారులు కోరిన విధంగా జాతర పనులు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను పట్టించుకోలేదనీ.. అయితే ప్రజా ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్ద బిడ్డ వేస్తోందన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ తరపున పనుల జాతర 2025 పోస్టర్ ను మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్షా 15వేల పనులు రూ.2198 కోట్ల వ్యయంతో ప్రారంభంకానున్నాయి. వీటిలో ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్లు, మేకల, గొర్రెల షెడ్లు, గ్రామీణ మోలిక వసతుల అభివృద్ధి పనులు ఉన్నాయి. ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామాల రూపురేఖలు మార్చడంలో ఈ పనుల జాతర కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ తరపున పనుల జాతర 2025 పోస్టర్ట్ ను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. శుకవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లక్షా15 వేల పనులు రూ.2198 కోట్ల వ్యయంతో ప్రారంభం కానున్నాయని వీటిలో ప్రభుత్వ పాఠశాలలలో మరుగుదొడ్లు, మేకల, గొర్రెల షెడ్లు, గ్రామీణ మోలికవసతుల అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామాల రూ పురేఖలు మార్చడంలో ఈ పనుల జాతర కీలక పాత్ర పోషిస్తుంది” అని అన్నారు. జాతరలో ప్రతి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని తాను వ్యక్తిగతంగా లేఖలు పంపినట్లు మంత్రి సీతక్క తెలిపారు.

కెటిఆర్ వ్యాఖ్యలపై సీతక్క మండి పాటు

కాంగ్రెస్ ది థర్డ్ క్లాస్ ప్రభుత్వం అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండి పడ్డారు. థర్డ్ క్లాస్ అంటే ఏంటో కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ అహంకారంతో, మాట్లాడుతున్నారు. ఆయనది డర్టీ మైండ్ అని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించడం కేటీఆర్ డర్టీ మైండ్ కు నిదర్శనం అని మండిపడ్డారు. ఇంట్లో కేసులు, వ్యక్తిగత సమస్యలతో విసిగిపోయి కేటీఆర్ ప్రస్ట్రేషన్ అవుతున్నారు. అంతేకాకుండా సొంత చెల్లెలు కవిత కూడా లేఖ రాసి తనను సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారని ఆరోపించారు. దానిపై కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇచ్చిన వారికి మద్దతు ఇస్తానని కేటీఆర్ చెబుతున్నారు. కానీ యూరియా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అని ఆయనకు తెలియదా? బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయి రాష్ట్రంలో యూరియా కొరతను సృష్టించాయని ఆరోపించారు. పార్లమెంటు వేదికగా ప్రియాంక గాంధీ సైతం పోరాటం చేస్తున్నారని మంత్రి సీతక్క గుర్తు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/minister-komatireddy-venkat-reddy-report-damaged-roads-floods/telangana/534217/

Adluri Laxman Kumar Breaking News latest news medaram jathara minister seethakka Sammakka Saralamma Jathara Telangana festivals Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.