📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Minister Seethakka: మహాయజంలా మేడారం అభివృద్ధి

Author Icon By Tejaswini Y
Updated: January 10, 2026 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ములుగు : దక్షిణ కుంభమేళా మేడారం మహా జాతరకు ఇంకా 19 రోజులే మిగిలి ఉంది. ప్రకృతే ఆరాధనగా జరిగేవన దేవతల దర్శనానికి పోటెత్తితే జన జాతరన ఘనకీర్తి ప్రపంచానికి చాటి చెప్పాలని, ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు ఆచారాలు ప్రతిబింబించేలా ఆలయ ప్రాంగణ పునరుద్ధరణ తుదిదశలో ఉంది. చరిత్రకు ప్రతిబింబంలా మేడారం ముస్తాబయింది. ప్రపంచానికి మూల పురుషులుగా ఆదివాసులు ఉన్నారనే ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, గొట్టుగోత్రాలు ప్రతిబింబించేలా పునరుద్ధరణ వనదేవతల ఘనకీర్తి చాటేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు.

Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

251 కోట్ల రూపాయలతో నాటి ఆదివాసీల చరిత్రకు సజీవరూపం కల్పిం చిన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఈ అభివృద్ధి పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యేక శ్రద్ద పెట్టారని రాష్ట్ర పంచా యతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. మేడారం హరిత హోటల్ లో శుక్రవారం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.. ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ లతో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం 251 కోట్ల రూపా యల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలి పారు.

Minister Seethakka: Development of Mahayajamla Medaram

మేడారం జాతరలో శాశ్వత ప్రతిపాదికన జరుగుతున్నా అభివృద్ధి పనులు, జాతర నిర్వహణ అంశాలు ప్రజలలోకి విసృతంగా తీసుకెళ్లాలని మీడియా ప్రతినిధులను కోరారు. గద్దెల పునరుద్ధరణ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, ఇంటి ఇలావేల్పులుగా సమ్మక్క సారలమ్మ దేవతలు ప్రసిద్ధి చెందారని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి వెన్నెల వెలుగులలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో గిరిజన నృత్యాల తో వన దేవతలు గద్దెల పైకి రావడం తో భక్త జనం భక్తి పారవశ్యం తో పులకరిస్తారని పేర్కొన్నారు.

మహాద్భుత ఘట్టం ఆవిష్కృతం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. గద్దెల పునరుద్ధరణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా 19వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రారంభించడం జరుగుతుందని, 18వ తేదీ సాయంత్రం ముఖ్యమంత్రి మేడారం చేరుకుంటారని, గద్దెల పునరుద్ధరణ ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఆలయ పునరుద్ధన విషయంలో గిరిజన పెద్దలతో, పూజారులతో, ఆదివాసి సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని, అందరి సమ్మతి, సంతకాలతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. జాతరలో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యత ఇస్తూ వారికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు లడ్డు ప్రత్యేక దుకాణాలు పెట్టించడం జరిగిందని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా జాతర నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐఏఎస్.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా జాతర నిర్వహించడం జరుగుతుందని, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. జాతరలో ప్రస్తుతం 5 వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని, జాతర , జాతర సమయం లో 30వేల మంది సిబ్బంది, జాతర అనంతరం 5 వేల మంది సిబ్బంది. విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.

Read also: Revanth Reddy: రావిర్యాల ఈ–సిటీలో సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ యూనిట్ ప్రారంభం

జాతర ప్రాంతాన్ని 8 జోన్స్ గా, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్ లో 8 మంది అధికారులు ఉంటారని అన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత. జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, ఐపిఎస్.ఈ ఏడు మేడారం మహా జాతరకు సుమారు రెండు కోట్ల పైగా భక్తులు తరలిరానున్నారని జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన్ అన్నారు. మేడారం జాతర సమయంలో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి మేడారం, వసర మేడారం రహదారుల వెంట ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్పోస్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాతర నిర్వహణ కోసం సుమారు 20 మంది ఐపీఎస్ అధికారుల సేవలను వినియోగించుకుంటామని, భక్తులకు సేవలు అందించడానికి స్థానిక యువత సిద్ధంగా ఉన్నారని, వాహనాల పార్కింగ్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు.

జాతర పరిసరాలను 450 సీసీ టీవీ, 20 ప్రత్యేక డ్రోన్స్ నిఘా తో పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ద్వారా గద్దెల ప్రాంగణం లో భక్తుల రద్దీని పర్యవేక్షి ంచడం జరుగుతుందని పేర్కొన్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం 20కి పైగా డ్రోన్లను ఉపయోగిస్తూ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షి స్తున్నామని వివరించారు. అధునాతన సాంకేతికతను వినియోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హీట్ మ్యాప్ టెక్నాలజీ ద్వారా అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో జన సమూహ నియంత్రణ మరింత సమర్థవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్డీవో వెంకటేష్, వరంగల్, ములుగు జిల్లాల మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Google News in Telugu medaram jathara Medaram Maha Jatara 2026 Mulugu District News South Kumbh Mela Medaram Telangana festivals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.