📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Seethakka: షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యం : మంత్రి సీతక్క

Author Icon By Sharanya
Updated: July 15, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


హైదరాబాద్: షోషకాహార తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తున్నదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. శక్తివంతమైన, ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణంలో అందరూ పాలు పంచుకోవాలని పిలపునిచ్చారు. సమష్టి కృషిలోనే పౌష్టిక తెలంగాణ సాధ్యపడుతుందని తెలిపారు. సిఎం రేవంత్రెడ్డి ఆలోచనల మేరకు దేశానికే ఆదర్శంగా తెలంగాణ అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దు తామన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు అనుగుణంగా అంగన్వాడీ సేవలను (Anganwadi services) మరింత మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సేవల బలోపేతం, చిన్నారుల్లో పోషకాహార మెరుగుదల, మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యం వంటి అంశాలపై రాష్ట్రస్థాయి సమావేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా వేదికగా సోమవారం జరిగింది.

సమష్టి కృషితోనే పౌష్టిక తెలంగాణ సాధ్యం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణ పోషకాహార (Telangana nutrition) ప్రణాళిక రూపొందిస్తామని, అంగన్వాడీ లబ్దిదారులకు రోజుకు 200 మిల్లీలీటర్ల విజయపాలు, కిశోర బాలికలకు పోషకాలతో కూడిన పల్లి, తృణధాన్య పట్టీలు, వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. పోషకాహార తెలంగాణ నిర్మాణం దిశగా భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. నిపుణుల అభిప్రాయాలను, అనుభవాల ఆధారంగా పోషణ తెలంగాణ కోసం కార్యాచరణను రూపొందించి, అమలు చేస్తామన్నారు. తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించారు. సేవల్లో తీసుకొచ్చిన మార్పులను వివరించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీల్లో ఎన్నో పోషకాలున్న కోడిగుడ్డు సరఫరాను నిలిపి వేయగా తెలంగాణలో చిన్నారులు గర్భిణులు, వాలింతలు, కౌమార బాలికలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. అన్ని రంగాల్లో ముందజలో ఉన్న రాష్ట్రంలో పోషకార లోపంతో పిల్లలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు విన్నత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వచ్చంద సంస్థలు, మహిళా స్వయం సహాయక బృందాల సహకారాన్ని తీసుకుం టామన్నారు. అంగన్వాడిల్లో ఆహారంతోపాటు అక్షరం, ఆరోగ్యం లభిస్తుందని పేరెంట్కు సూచించారు. ఇక నిర్మాణ సౌకర్యం లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇక అంగన్వాడీ కేంద్రా లను దత్తత తీసుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఆసక్తిని తెలిపిన నేపథ్యంలో అవసరమైన ప్రోత్సాహక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేకంగా పోషన్ వాటిక కార్యక్రమం కింద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా ఆరు రకాల కూర గాయల విత్తనాలతో కూడిన సీడ్స్కట్స్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మొదటి విడతలో 4,500 అంగన్వాడీ కేంద్రాలకు ఈ విత్తనాల కిట్లు పంపి ణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో పాలకూర, తోటకూర, మెంతి కూర, టమాట, వంకాయ, బెండకాయ విత్తనాలు ఉన్న ట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో వీటిని పెంచి లబ్ధి దారులకు వండిపెట్టేలా చర్యలు తీసుకుం టామ న్నారు. ఈ సమావేశంలో పోషకారంపై పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, సీఎఫ్ టిఆర్ ఐ (మై సూర్), ఎయిమ్స్, ఇక్రిసాట్, యూనిసెఫ్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ప్రథం, ఆంధ్ర మహిశాసభచైర్మన్, ఐలరక్ష భారతి వంటి స్వచ్చంద సంస్థల ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Crime: పర్యాటక కేంద్రమైన గండికోటలో విద్యార్థిని శవం కలకలం…

Anganwadi nutrition program Breaking News latest news minister seethakka Telangana government welfare Telangana nutrition mission Telugu News Women and child welfare

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.