हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Minister Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తాం: మంత్రి పొన్నం

Anusha
Minister Ponnam Prabhakar: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తాం: మంత్రి పొన్నం

త్వరలోనే దేశవ్యాప్తంగా అతి పెద్ద పండుగలలో ఒకటైన వినాయక చవితి రాబోతోంది. ఈ సంవత్సరం ఈ నెల 27న గణేష్ చతుర్థి పర్వదినం జరగనుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హైదరాబాద్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. గల్లీ గల్లీకి గణపయ్య ప్రథిమలు ప్రతిష్ఠించబడి, భక్తులు తొమ్మిది రోజుల పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అనంతరం విగ్రహాలు గంగమ్మ తల్లి ఒడికి చేరేలా నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించబడతాయి.ఈ నేపథ్యంలో ఉత్సవాలను ఘనంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యంగా భద్రతా చర్యలు, ట్రాఫిక్ సదుపాయాలు, నీరు-విద్యుత్ సరఫరా, శానిటేషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సమీక్షా సమావేశం నిర్వహించి కీలక సూచనలు జారీ చేశారు.

హైదరాబాద్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన

సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, డీజీపీ జితేందర్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌తో పాటు మూడు కమిషనరేట్ల పోలీసులు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ లో ప్రత్యేక గుర్తింపు పొందిన వేడుకలని, అందుకే ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.అలానే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలను (Ganesh Festival) గొప్పగా జరుపుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Minister Ponnam Prabhakar
Minister Ponnam Prabhakar

సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు

ప్రజల సాయంతో రాష్ట్రంలోనే కాక దేశంలోనే.. హైదరాబాద్‌ నగరంలో గణేష్ ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయని తెలిపారు. ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ అంశంలో పోయిన ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంతో సాయం చేశారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం గుర్తు చేశారు.

ఆయన ఏ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు?

పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాకు చెందిన హుస్నాబాద్ నియోజకవర్గం నుండి తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

పొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితం ఎలా మొదలైంది?

విద్యార్థి దశలోనే పొన్నం ప్రభాకర్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలలో ముందంజలో నిలిచారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/cpi-cpis-4th-state-congress-begins-tomorrow/telangana/532703/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870