📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం

Author Icon By Uday Kumar
Updated: February 25, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బండి సంజయ్ మరియు కరీంనగర్ జిల్లా అభిప్రాయాలు

కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్.బండి సంజయ్ కరీంనగర్‌ జిల్లా కి చెందిన వారు. దిగజారుడు మాటలు మాట్లాడితే కరీంనగర్ జిల్లా ఓటేసిన మిత్రులు బాధపడుతున్నారు. బీసీ బిడ్డ గా మీకు కేంద్రంలో స్థానం రావడం మాకు సంతోషం. ప్రతి అంశంలో భారతదేశాన్ని పాకిస్తాన్ ను.. హిందువు ముస్లిం లను ముడిపెట్టడం, ప్రతి ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అలవాటు అయింది.

క్రికెట్ మరియు రాజకీయాల మధ్య సంబంధం

దుబాయ్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లో భారత్ గెలిచింది ఆది హర్షించదగినది. అదేదో బీజేపీ గెలిపించినట్టు క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సిగ్గుచేటు. పట్టభద్రుల ఎన్నికలు రాష్ట్ర స్థితిగతులు, రాష్ట్ర అంశాలను అవగాహనతో ఓటు వేసే అంశం.కరీంనగర్‌.

బీజేపీ, BRS కూటమి మరియు చీకటి ఒప్పందాలు

బీజేపీ BRS పదేళ్లుగా చీకటి లోపాయికారి ఒప్పందం మరోసారి బయటపడింది. ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టకుండా బీజేపీ కి మద్దతుగా నిలుస్తుంది. నిన్ను ఉమ్మడి నిజామాబాద్ ,కరీంనగర్ లో జరిగిన సమావేశాలు విజయవంతం కావడంతో దిమ్మతిరిగి మాట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డి నాయకత్వం

మీరందరూ కలిసిన నరేందర్ రెడ్డి గారి గెలుపు ఆపలేరు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు మీరు పది సంవత్సరాల్లో చేసిన దానిపై చర్చకు సిద్ధం.

ఉద్యోగ భర్తీ మరియు అటువంటి విషయాలు

ఒక సంవత్సర కాలంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మీరు 10 ఏళ్లలో 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి.

కేటీఆర్ ఫార్ములా మరియు నేరాలు

కేటీఆర్ ఫార్ములా ఈ రేసు అవినీతి పై అంశం పై బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు. పోన్ ట్యాపింగ్ ఎంత తీవ్రమైన నేరం.. కేంద్ర ప్రభుత్వం లో మీరు మంత్రిగా ఉన్నారు. ఎందుకు సీబీఐ విచారణ వేయలేదు.. పోలీస్ అధికారులను తప్పించడానికి ఎవరు చూస్తున్నారు?

రాష్ట్ర ప్రభుత్వం మరియు న్యాయం

రాష్ట్ర ప్రభుత్వం పరిమితి తెలియదా.. విదేశాల్లో ఉన్న పోలీసులను ఎందుకు వెనక్కి తెప్పించడం లేదు. స్వతంత్ర భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే చేశాం.

సర్వే మరియు రాజకీయ ద్రోహాలు

సమగ్ర కుటుంబ సర్వే ఆఫీసియల్ కాదు.. ఆది ఒక్క రోజులో చేసిన తప్పుల తడక. కేటీఆర్ 51 శాతం చూపించారు.. నాలుగు కేటగిరి లు చూపించారు. మేము 56 శాతం బీసీ లు చూపెట్టాం.

బండి సంజయ్ మరియు రాజకీయ విమర్శలు

బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మిగిలిన 3.1 శాతం కుటుంబాలు కూడా సర్వే చేస్తున్నాం. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు లాంటి వారికి కూడా 28 వరకు అవకాశం ఇస్తున్నాం.

బీసీ సర్వే మరియు బీజేపీ

బండి సంజయ్ కేంద్ర మంత్రి గా ఉండి మాట్లాడుతున్న వాటికి ఖండిస్తున్నాం. గుజరాత్ గురించి మాట్లాడే బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడరు. బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రం నుండి రావాల్సిన నిధులు, మెట్రో రైల్ నిధులు, ఫోర్త్ సిటీ అంశం తదితర వాటిపై ఎప్పుడైనా నిధులు అడిగారా…?

తెలంగాణ అభివృద్ధి పై స్పందన

ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. మీరు కరీంనగర్ కోసం ఏం చేశారు.. జిల్లా అభివృద్ధి కూడా పట్టదు. అడుగడుగున మత రాజకీయాలు చేస్తూ ఓట్లు అడగడమేనా?కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్.

కుల సర్వే పై బీజేపీ అభిప్రాయం

మీరు బండి సంజయ్, కిషన్ రెడ్డి లు రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర ఏంటి? కుల సర్వే పై మీ అభిప్రాయం ఏంటి? దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా కుల సర్వే చేసి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తుంటే 9 వ షెడ్యూల్ లో చేరుస్తామని ప్రధాని నీ ఒప్పించి 42 శాతం రిజర్వేషన్లకు తెస్తామని బీజేపీ నేతలు ఎందుకు చెప్తలేరు?

బీసీ సమస్యలు మరియు బీజేపీ నోరు మూసుకోవడం

బీసీ ను అధ్యక్ష పదవి నుండి తొలగించి కిషన్ రెడ్డి నీ చేస్తే బీసీ లకు అన్యాయం జరగలేదా..? దానిపై బీజేపీ ఎందుకు సమాధానం చెప్పలేదు? రెడ్డి ముఖ్యమంత్రి అయిన బీసీ కుల గణన చేసి 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధం చేస్తుండడం హర్షించదగినదా కదా..?

బీసీ లను అణగదొక్కడం

బీసీ లను అణగదొక్కుతున్న బీజేపీ కి ఓటేస్తారా…? బీసీ లకు సర్వం చేస్తున్న కాంగ్రెస్ కి ఓటేస్తారా? పట్టభద్రులు ఆలోచించాలి.

సోషల్ మీడియా మరియు అబద్ధపు ప్రచారం

సోషల్ మీడియా ను అనైతికంగా అబద్ధపు ప్రచారానికి, వీడియోలను మార్ఫింగ్ చేయడానికి బీజేపీ విచ్చలవిడగ వాడుతుంది. ప్రజలు గమనించాలి.

పట్టభద్రుల అభ్యర్థి పెట్టకపోవడం

Brs అభ్యర్థిని ఎందుకు పెట్టలేదు పట్టభద్రులు గమనించాలి..ఎవరికి సహాయానికి చేయడానికి అభ్యర్థిని పెట్టలేదు.

కాంగ్రెస్ అభివృద్ధి మరియు సంక్షేమం

అభివృద్ధి పథంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణిస్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నిక. ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన తరువాత ఆర్థిక విధ్వంసం చేసిన గాడిలో పెడుతూ కార్యక్రమాలు చేస్తున్నాం. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి.

నరేందర్ రెడ్డి గెలుపు పై కాంగ్రెస్ విశ్వాసం

అభివృద్ధి సంక్షేమం వైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయాణిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి. మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి మంచి మెజారిటీ తో గెలుస్తున్నారు.

ఉద్యోగ భర్తీ మరియు అభివృద్ధి ప్రణాళికలు

పట్టభద్రుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. 9 నెలల్లో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం లో చేసిన గ్రూప్ 1 ఉద్యోగాల తరువాత మళ్ళీ ఇప్పుడే చేస్తున్నాం.

రైతాంగం, పరిశ్రమలు మరియు మహిళా అభివృద్ధి

రైతాంగం పరిశ్రమలు, మహిళా అభివృద్ధితో ముందుకు పోతున్నాం. 11 ఏళ్లుగా మీ ప్రధాన మంత్రి కేంద్రంలో ఉన్నారు.

మోదీ పాలన పై విమర్శలు

కరీంనగర్‌ 2014 లో ఎన్నికల్లో శ్రీరామ చంద్రుడిని వాడుకున్నారు.. 5 ఏళ్ళు పాలన చేశారు. ఈదేశానికి ఏం చేశారు.. మళ్ళీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగారు.

భక్తుల అనుబంధం మరియు పథకాలు

మేము భక్తులమే.. మేము పూజలు చేస్తాం. ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టారు.. పెదోడిని కొట్టి పెద్దోళ్లకే పెడుతున్నారు.కరీంనగర్‌.

పెట్రోల్ ధరలు మరియు పెరుగుతున్న ధరలు

అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ తక్కువగా ఉన్న మీరు పెట్రోల్ ధరలు తగ్గించలేదు. నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.. మోదీ ప్రభుత్వం బీదవాల్లకి ఏం న్యాయం చేశారు?

బీజేపీ పై విమర్శలు

మీరు 11 సంవత్సరాలుగా ఏం చేశారో చెప్పక మళ్ళీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడిగుతున్నారు.. మేము ఎప్పుడూ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగలేదు.

రూపాయి విలువ, ద్రవ్యపథకాలు మరియు పెరుగుదల

శ్రీరామ చంద్రుడు బీజేపీ పార్టీని ప్రారంభించినట్లు చేస్తున్నారు.. ఈ దేశానికి మీరు ఏం అభివృద్ధి చేశారు..

Breaking News in Telugu Google news Google News in Telugu Karimnagar Latest News in Telugu Paper Telugu News ponnam prabakar Telangana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.