పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తనదైన కొత్త తరహా నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా.. ఈవీ పాలసీ ద్వారా ఎలక్ట్రిక్ వెహికిల్స్ (Electric Vehicles) పై భారీగా రాయితీలు ఇచ్చింది. దీని వల్ల గత రెండేళ్లలో ప్రజలు రూ.806 కోట్ల రూపాయల బెనెఫిట్ పొందారు. ఎలక్ట్రిక్ వాహనాలపై చర్చించేందుకు తాజాగా ఆటోమొబైల్ కంపెనీల ప్రతినిధులు, డీలర్లు.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) తో తాజాగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
Read Also: HYD: భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. వెలుగులోకి కొత్త విషయం
పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు మంత్రి (Minister Ponnam) ఒక వినూత్న ప్రతిపాదనను డీలర్ల ముందు ఉంచారు. ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారునికి ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి.. వారిని పర్యావరణ ప్రేమికులుగా మార్చాలని సూచించారు. ఈ చిన్న మార్పు సమాజంలో కాలుష్య నివారణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కేవలం వాహనం అమ్మడమే కాకుండా, పచ్చదనాన్ని పెంచడంలో డీలర్లు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వ ఈవీ పాలసీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తయారీ కంపెనీలపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,59,304 ఎలక్ట్రిక్ వాహనాలకు రూ. 806.35 కోట్ల మేర రాయితీలు అందించినట్లు ఆయన వివరించారు.
‘జీరో ఉద్గారాల’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఈవీల వినియోగం పెరగాలంటే మౌలిక సదుపాయాలు పటిష్ఠంగా ఉండాలని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు, షోరూమ్‌ల వద్ద ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని అధికారులను, కంపెనీలను ఆదేశించారు. తెలంగాణ విజన్-2047 (Telangana Vision-2047) లో భాగంగా ‘జీరో ఉద్గారాల’ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ లక్ష్యం దిశగా ప్రభుత్వం తనవంతుగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై ప్రభుత్వ శాఖలు, సంస్థలు కొనుగోలు చేసే కొత్త వాహనాల్లో కనీసం 20 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.రహదారి భద్రతపై కంపెనీల బాధ్యత వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ‘రహదారి భద్రత’ వారోత్సవాల్లో ఈవీ తయారీ కంపెనీలు, డీలర్లు చురుగ్గా పాల్గొనాలని మంత్రి సూచించారు.వాహనదారులలో భద్రత పట్ల అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: