📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Minister Ponnam: ఎన్ఫోర్స్మెంట్స్ ను మరింత కఠినతరం చేయాలి

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 12:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి, మరణాల రేటును నివారించే విధంగా కృషి చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) అధికారులను ఆదేశించారు. రవాణా శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను (Enforcement) మరింత కఠినతరం చేయాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కొత్తగా ఏర్పడిన 33 జిల్లా స్థాయి బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ నిరంతర తనిఖీలు చేపట్టాలన్నారు.

Read Also: Puttaparthi: ‘సత్యసాయి’కి ఉరవకొండతో విడదీయరాని బంధం!

Minister Ponnam Enforcements should be made stricter

ఓవర్ లోడ్‌పై కఠిన చర్యలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా ఓవర్ లోడ్ (Overload) వల్లే జరుగుతున్నందున, దానిపై ఎక్కువగా దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.

గత 10 రోజుల వ్యవధిలో తనిఖీలు చేపట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 4,748 కేసులు నమోదు చేయబడ్డాయి, మొత్తం 3,420 వాహనాలు సీజ్ చేయబడ్డాయి.

రోడ్డు భద్రత మాసోత్సవం, సిబ్బంది అంశాలు

గత సంవత్సరం నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవం మంచి ఫలితాలు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈసారి జనవరిలో జరిగే మాసోత్సవాలపై ఇప్పటినుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో విద్యార్థులు, డ్రైవర్లు, కార్మికులు, పోలీసులు, అధికారులు భాగస్వామ్యం ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల నుంచి కాలేజీ వరకు వ్యాసరచన పోటీలు, రోడ్డు నిబంధనలపై నాటకాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీ చేయడంతో పాటు, ప్రమోషన్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu overload fine ponnam prabhakar road safety RTA enforcement Telangana transport. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.