📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Telugu news: Minister Ponguleti: హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

Author Icon By Tejaswini Y
Updated: December 16, 2025 • 12:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Housing Board: హౌసింగ్ బోర్డు భూములు పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అంగుళం భూమి కూడా అన్యాక్రాంతం కావడానికి వీల్లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూములపై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు, అగ్రిమెంట్లు, కోర్టు కేసులు, అద్దెలు తదతర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఒకవైపు భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే మరో వైపు లీజు, కమర్షియల్, అద్దెలు, రెగ్యులరైజేషన్ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

Read Also: Sarpanch Rights : సర్పంచుల హక్కులకోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ – KTR

హౌసింగ్ బోర్డు లీజులు, అద్దెలపై కార్యాచరణ ప్రణాళికకు ఆదేశాలు

నిజాం కాలం నుంచి 115 సంస్థలకు హౌసింగ్ బోర్డు భూములను లీజుకు ఇవ్వడం జరిగిందని, ఇందులో ప్రధానంగా ఇనిస్ట్యూషన్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, స్కూల్స్, టెంపుల్స్ తదితరాలు ఉన్నాయని, ఏడు స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు, అలాగే అద్దెబకాయిలు ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. లీజు అగ్రిమెంట్ పునరుద్ధరణ చేసుకోని సంస్థలకు హౌసింగ్ బోర్డు తరపున లేఖలు రాసి వాటి రెగ్యులరైజేషన్కు అవకాశం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Minister Ponguleti: Strong measures to protect Housing Board lands

రాష్ట్రంలో హౌసింగ్ బోర్డుకు వివిధ ప్రాంతాల్లో 301 కమర్షియల్ షాపులు ఉండగా 2007లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం మేరకు 14 మంది షాపులు కొనుగోలు చేయగా మిగిలిన 287 షాపులకు గాను 62 షాపులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని, హౌసింగ్ బోర్డు(Housing Board) నిబంధనల ప్రకారం ప్రతి షాపు యజమాని ప్రతి ఏడాది 10శాతం అద్దెను పెంచుతూ షాపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే ఈ నిబంధన అమలు కాకపోవడంతో షాపు యజమానుల నుంచి హౌసింగ్ బోర్డుకు కోట్లాది రూపాయిలు రావలసి ఉందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దీనిపై మంత్రిగారు స్పందిస్తూ ప్రస్తుతం షాపులు నిర్వహిస్తున్నవారు ఆ షాపులను కొనుగోలు చేయడానికి ముందుకువస్తే మార్కెట్ ధర ప్రకారం విక్రయించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు.

హౌసింగ్ బోర్డు భూములపై క్యాబినెట్‌లో తుది నిర్ణయం

అలాగే షాపు నిర్వహణకు అనువుగా లేకపోతే ఆ స్థలాన్ని వేలంలో విక్రయించాలని సూచించారు. కోర్టు కేసులలో ఉన్న భూములు హౌసింగ్ బోర్డుకు చెందేలా పటిష్టమైన వాదన వినిపించేలా ప్రత్యేకంగా అడ్వకేట్ను నియమించుకోవాలని సూచించారు. హౌసింగ్ బోర్డు గతంలో కేటాయించిన ఇండ్లకు పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాలను ఆ ఇంటి యజమానికి ఆసక్తి ఉంటే విక్రయించాలని అలాగే గతంలో ఇంటి కోసం హౌసింగ్ బోర్డు కేటాయించిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోనివారికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాలని, పక్కనే ఉన్న వంద గజాల లోపు స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకుంటే మొత్తం స్థలానికి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. మార్కెట్ ధర, సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ కార్డు విలువ వంద గజాల లోపు స్థలాల వివరాలు, రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల వివరాలు, రిజిస్ట్రేషన్ చేసుకొని పక్కనే ఉన్న వంద గజాలలోపు స్థలాన్ని అడుగుతున్నవారి వివరాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక తయారుచేయాలని అధికారులకు సూచించారు. వీటన్నింటిపై క్యాబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్బోర్డు ఎండీ విపిగౌతమ్, సీఈ వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Housing Board lands ponguleti srinivas reddy Revenue Minister Telangana Telangana Housing Board

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.