📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Minister Ponguleti – మంత్రి పొంగులేటి బయోపిక్..హీరో గా ఎవరు నటించనున్నారంటే?

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంగ్రెస్ పార్టీ నేత, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) శ్రీనివాస్ రెడ్డి జీవితాన్ని ఆధారంగా తీసుకుని బయోపిక్ సినిమా నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు భయ్యా వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని అధికారులు వెల్లడించారు. సినిమా పేరుగా “శ్రీనన్న అందరివాడు”ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ్, మరిది భాషల్లో మొత్తం ఆరు భాషల్లో పాన్-ఇండియా చిత్రంగా రూపొందించనున్నారు అని నిర్మాతలు తెలిపారు.

సినిమా కథలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ జీవితం ప్రధానంగా చూపించబడనుందని సమాచారం. ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ (Suman) మంత్రి పొంగులేటి పాత్రలో కనిపించనున్నారు. దర్శకులు, రచయితలు ఆయన వ్యక్తిత్వం, రాజకీయ నిర్ణయాలు, సామాజిక చైతన్యం వంటి అంశాలను సినిమాకు ప్రతిబింబింపజేయాలని భావిస్తున్నారు.ఈ శ్రీనన్న అందరివాడు సినిమాకు.. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్, నిర్మాతగా.. భయ్యా వెంకట నరసింహ రాజ్‌ వ్యవహరించనున్నారు.

కాసర్ల శ్యామ్ పాటలు రాయనున్నారు

సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటుగా అస్సామీలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ శ్రీ వెంకట్ అందిస్తుండగా.. కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) పాటలు రాయనున్నారు. ఈ క్రమంలోనే శ్రీనన్న అందరివాడు సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ శ్రీనన్న అందరివాడు సినిమా పోస్టర్‌లో ఒక వైపు హీరో సుమన్ ఫోటో..

Minister Ponguleti

మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కనిపిస్తున్నారు.2014లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత అప్పటి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) తీర్థం పుచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్రాజుకు మద్దతు ప్రకటించారు.

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ

ఆ తర్వాత 2023లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో అదే ఏడాది జూలైలో ఖమ్మంలో జరిగిన‘తెలంగాణ జన గర్జన బహిరంగ సభలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

ఇక 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/jr-ntr-junior-ntr-injured/cinema/550538/

Bhai Venkata Narasimha Rao Biopic Breaking News Congress leader latest news movie announcement ponguleti srinivas reddy Telangana Revenue Minister Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.