📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Minister Komatireddy: రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు!

Author Icon By Anusha
Updated: August 17, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు రోడ్లు, మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకంగా రోడ్లు-భవనాల శాఖ పరిధిలో ఉన్న రహదారులు దాదాపు ధ్వంసమైపోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రోడ్లు చిత్తడిగా మారి, కంకరలు బయటకు వచ్చి పెద్ద పెద్ద గుంతలు (Big holes) ఏర్పడటంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గత వర్షాకాలంలో చేపట్టిన మరమ్మతులు కూడా ఈ సారి కురిసిన భారీ వానలకు తట్టుకోలేకపోయాయి. ఫలితంగా మరింత నష్టం సంభవించింది. శనివారం వరకు అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం 454 ప్రాంతాల్లో 629.22 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వీటిలో 22 ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది.

యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టాలని శాఖ యంత్రాంగం

ఈ దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడానికి రూ. 28.70 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇక శాశ్వత మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ. 678.86 కోట్లు అవసరమని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 37 ఆర్అండ్‌బీ డివిజన్లలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన పనులను చేపట్టాలని శాఖ యంత్రాంగం దృష్టి సారించింది.ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) రోడ్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. మరో రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

Minister Komatireddy

ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా

సర్కిళ్ల వారీగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి వాటిని ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని సూచించారు.రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు కల్వర్టులు, లోతట్టు వంతెనలు, కాజ్‌వేలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రమాదాలు, ప్రాణనష్టం జరగకుండా ప్రజలను హెచ్చరించాలని సూచించారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా రోడ్లకు ముందుగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని సూచించారు. శాశ్వత పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని.. అవసరాన్ని బట్టి సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలన్నారు. మరో రెండు రోజుల పాటు అధికారులు ఎవరూ సెలవుపై వెళ్లొద్దని మంత్రి స్పష్టం చేశారు. ఈ వర్షాల వల్ల కలిగే నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆయన ఏ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు?

ఆయన నల్గొండ జిల్లా బువనగిరి (భువనగిరి) నియోజకవర్గం నుంచి ఎన్నిసార్లయినా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ద్వారా పలు పదవులు చేపట్టి ప్రజా సేవ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/medak-district-three-friends-tried-to-rob-banks-and-atms-after-watching-on-youtube/telangana/531435/

Breaking News damaged roads telangana komatireddy venkat reddy news latest news telangana government review telangana road repair funds Telugu News vikash raj telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.