📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Gaddam Vivek: అచ్చంపేటలో మున్సిపల్ కార్యాలయ భవనం ప్రారంభించిన మంత్రి గడ్డం వివేక్

Author Icon By Sharanya
Updated: August 12, 2025 • 6:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట్ స్వామి (Gaddam Vivek)అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, పట్టణాలు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసేలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.

Gaddam Vivek

రూ.3 కోట్ల నిధులతో మున్సిపల్ కార్యాలయ భవనం

నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో రూ.3 కోట్ల నిధులతో అత్యధిక ఆంగులతో నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని (Municipal office building) నాగర్కర్నూల్ శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణలు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లతో కలిసి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖల మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek) మాట్లాడుతూ రాష్ట్రంలోని అత్యంత సుందరమైన భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇలాంటి మున్సిపాలిటీ భవనాన్ని ఎక్కడ చూడలేదని మంత్రి తెలిపారు. ఇంతటి గొప్ప భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిర్మాణానికి ప్రత్యేక కృషి చేయడంతోనే భవనం సుందరంగా రూపుదిద్దుకుందని మంత్రి ఎమ్మెల్యేను అభినందించారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సకాలంలో తొలగింపు, కాలువల శుభ్రత, తాగునీటి సరఫరా (Drinking water supply)లో వ్యత్యాసాలు లేకుండా చూసేలా సంబంధిత శాఖల అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి నివాసానికి శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో కాలు వలు, డ్రైనేజీలు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తాం

పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిత్య పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు, తదితర వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇవి సామాజిక, ఆర్ధిక ప్రగతికి తోడ్పడుతున్నాయని మంత్రి వివేక్ వెంకట స్వామి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తామని, ఇందులో భాగంగా ఒక్కొక్కటిగా నిరంతరంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఇచ్చిన వాగ్దానంతో అర్హులైన అందరికీ పథకాలు అందిస్తూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నామని, ఆర్ధిక వ్యవస్థను మెరుపరుస్తూన్నా మన్నారు. ప్రతి ఒక్కరికి కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో ఆహార భద్రత చట్టం తీసుకురావడం జరిగిందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు కదుపునిండా తిండి తినలేక పోవడానికి గ్రహించి నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

మన రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు రూ.500ల బోనస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ పండించిన సన్న బియ్యాన్ని ధనవంతుడు తింటున్న విధంగానే పేదలు తినాలన్న ఉద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్ర మాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పేదలకు 5 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున పేద ప్రజల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ చేశామని తెలిపారు. గృహ జ్యోతి పథకం, గ్యాస్ పథకం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిక్షతతో ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన లబ్దిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ రావుల గిరిధర్, మున్సిపల్ చైర్మన్ జి.శ్రీనివా సులు, మున్సిపల్ కమిషనర్ మురళి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read also:

Achampet Breaking News Gaddam Vivek latest news Municipal Office Inauguration Telangana Minister Telugu News Urban Development

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.